Memu Famous Collections: ‘మేము ఫేమస్’ 3 రోజుల వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి అతి చేరువలో!
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు కోట్ల రూపాయలకు జరిగింది. కొత్తవాళ్లకు అంత ప్రీ రిలీజ్ బిజినెస్ రిస్క్ అవసరమా..?, తేడా జరిగితే ఒక్క రూపాయి కూడా రాదు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ చిత్రం మొదటి రోజే 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపర్చింది.

Memu Famous Collections: ఊరుపేరు తెలియని హీరోలకు కూడా ఆడియన్స్ బంపర్ ఓపెనింగ్స్ ఇస్తున్న రోజులివి. కేవలం కంటెంట్ బాగుండాలి అంతే, అలా కేవలం కంటెంట్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రగిలించి సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మెచ్చుకొని పొగిడిన చిత్రం ‘మేము ఫేమస్’. టీజర్ మరియు ట్రైలర్ కారణంగా భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు కోట్ల రూపాయలకు జరిగింది. కొత్తవాళ్లకు అంత ప్రీ రిలీజ్ బిజినెస్ రిస్క్ అవసరమా..?, తేడా జరిగితే ఒక్క రూపాయి కూడా రాదు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ చిత్రం మొదటి రోజే 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపర్చింది.
కానీ రెండవ రోజు మాత్రం మొదటి రోజు కంటే తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు 47 లక్షల రూపాయిలు మాత్రమే వచ్చాయి. అయితే మొదటి రోజు వసూళ్ళలో ముందు రోజు ప్రదర్శింపబడిన ప్రీమియర్ షో వసూళ్లను కూడా కలిపారని,అందుకే ఎక్కువ వసూళ్లు వచ్చినట్టుగా కనిపించిందని, వాస్తవానికి రెండవ రోజే ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక మూడవ రోజు కూడా 49 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, టోటల్ గా మూడు రోజులకు కలిపి కోటి 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 70 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టాలి, కాబట్టి వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి షేర్స్ ని వసూలు చెయ్యాల్సిన అవసరం ఉంది.