Memu Famous Collections: ‘మేము ఫేమస్’ ఓపెనింగ్స్ మొదటి రోజు వసూళ్లు..కొత్తవాళ్లతో ఇదేమి అరాచకం సామీ!

సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు కచ్చితంగా ఆదరిస్తారు అనేందుకు ఎన్నో ఉదాహరణలను ఇది వరకు మనం చూసాము. రీసెంట్ గా అలా విడుదలకు ముందే జనాల్లో ఆసక్తి కలిగించిన చిత్రాలలో ఒకటి ‘మేము ఫేమస్’.

  • Written By: Vicky
  • Published On:
Memu Famous Collections: ‘మేము ఫేమస్’ ఓపెనింగ్స్ మొదటి రోజు వసూళ్లు..కొత్తవాళ్లతో ఇదేమి అరాచకం సామీ!

Memu Famous Collections: రీసెంట్ సమయం లో స్టార్ హీరో సినిమా విడుదలై సంవత్సరం దాటింది. సీనియర్ హీరోలు మరియు , కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ హవానే ఈ గ్యాప్ లో బాగా షైన్ అయ్యింది. ఈ సమ్మర్ లో కూడా భారీ బడ్జెట్ తో విడుదలైన సినిమాలకంటే, తక్కువ బడ్జెట్ తో పెద్దగా స్టార్ క్యాస్ట్ లేని సినిమాలు కేవలం కంటెంట్ ని నమ్ముకొని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు కచ్చితంగా ఆదరిస్తారు అనేందుకు ఎన్నో ఉదాహరణలను ఇది వరకు మనం చూసాము. రీసెంట్ గా అలా విడుదలకు ముందే జనాల్లో ఆసక్తి కలిగించిన చిత్రాలలో ఒకటి ‘మేము ఫేమస్’. ఈ చిత్రం లో నటించిన నటీనటుల నుండి టెక్నికల్ టీం వరకు అందరూ కొత్తవాళ్లే. అలాంటి కొత్తవాళ్లతో నిర్మింపబడ్డ ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

దానికి తోడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్వీట్ వెయ్యడం వల్ల కూడా ఈ చిత్రానికి భారీ హైప్ రావడానికి కారణం అయ్యింది. దానికి తోడు టాక్ కూడా కలిసి రావడం తో ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 2 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

టాక్ బాగుంది పైగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు కాబట్టి ఈ వీకెండ్ కి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలకు బిజినెస్ చెయ్యడం మంచిదని,గత ఏడాది నుండి ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలను ఇస్తున్నాయని అంటున్నారు బయ్యర్స్.