Mahesh Babu: మహేష్ బాబు గాలి తీసేసిన కుర్రాళ్ళు!

మేమ్ ఫేమస్ ప్రమోషన్స్ గట్టిగా చేశారు. సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకున్నారు. ఈ మూవీ విడుదలకు ఒక్కరోజు ముందు మహేష్ సినిమా అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. సాంకేతికంగా, విజువల్స్ పరంగా, కథ, కథనం అద్భుతం అన్నారు. నటులను కూడా ఓ రేంజ్ లో పొగిడారు. మహేష్ వంటి సూపర్ స్టార్ ఒక చిన్న సినిమా గురించి స్పందించడంతో మూవీ చాలా బాగుంటుందని ప్రేక్షకులు పోటెత్తారు. తీరా సినిమా చూశాక బేజారు అయ్యారు.

  • Written By: SRK
  • Published On:
Mahesh Babu: మహేష్ బాబు గాలి తీసేసిన కుర్రాళ్ళు!

Mahesh Babu: మహేష్ బాబుకు స్టార్ రివ్యూవర్ అనే పేరుంది. చిన్నా పెద్దా బేధం లేకుండా బాగున్న సినిమాలను ఉద్దేశించి ఆయన ట్వీట్స్ వేసేవారు. నచ్చిన సినిమాలకు మాత్రమే మహేష్ రివ్యూ ఇచ్చేవారు. అందుకే మహేష్ రివ్యూలకు ఓ విశ్వసనీయత ఉండేది. తాజాగా ఓ మూవీ విషయంలో ఆయన అబాసుపాలయ్యారు. ఔత్సాహికులు కొందరు కలిసి మేమ్ ఫేమస్ టైటిల్ తో ఒక చిత్రం చేశారు. సుమంత్ ప్రభాస్ అనే యువకుడు దర్శకత్వం వహించి నటించాడు.

మేమ్ ఫేమస్ ప్రమోషన్స్ గట్టిగా చేశారు. సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకున్నారు. ఈ మూవీ విడుదలకు ఒక్కరోజు ముందు మహేష్ సినిమా అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. సాంకేతికంగా, విజువల్స్ పరంగా, కథ, కథనం అద్భుతం అన్నారు. నటులను కూడా ఓ రేంజ్ లో పొగిడారు. మహేష్ వంటి సూపర్ స్టార్ ఒక చిన్న సినిమా గురించి స్పందించడంతో మూవీ చాలా బాగుంటుందని ప్రేక్షకులు పోటెత్తారు. తీరా సినిమా చూశాక బేజారు అయ్యారు.

అసలు మహేష్ ఈ సినిమా చూసే ట్వీట్ చేశాడట. ఆయన రివ్యూకి సినిమాకు సంబంధం లేదని వాపోతున్నారు. ఒక సినిమాను ప్రమోట్ చేస్తూ ట్వీట్ వేయవచ్చు. కానీ నేను చూశాను బాగుందని రివ్యూ ఇచ్చేటప్పుడు నిజాతీయగా ఉండాలి. చెప్పిన దానికి కొంచెం దగ్గరగా ఉండాలి. సినిమాకు తక్కువ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ అన్నట్లు తక్కువ బడ్జెట్ తో మేమ్ ఫేమస్ మూవీ చేశారు. కుర్రాళ్ళ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. అలా అని ఇదో కళాఖండం అని చెబితే సదరు స్టార్ హీరో పరువు పోతుంది.

మేమ్ ఫేమస్ లో అసలు ఏముందని మహేష్ అంతగా పొగిడారని పలువురు కౌంటర్లు వేస్తున్నారు. అదే సమయంలో మహేష్ సినిమాలు చూడకుండానే ట్వీట్స్ వేస్తున్నారా? ఒక వేళ ఆయన టీమ్, పిఆర్ సభ్యులు అందుకు పాల్పడితే నిజానిజాలు నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మహేష్ మీద ఉంది. మేమ్ ఫేమస్ మూవీ రివ్యూ మహేష్ ఇవ్వలేదనేది స్పష్టం. ఆయన పీఆర్ టీం గుడ్డిగా ఈ ట్వీట్ వేశారు. అది బ్యాక్ ఫైర్ అయ్యింది. మహేష్ ని అడ్డంగా బుక్ చేసింది.

సంబంధిత వార్తలు