Bigg Boss Srisatya : స్టార్ మా లో ఇటీవల ప్రారంభమైన బీబీ జోడి ప్రేక్షకుల దృష్టి ఆకర్షిస్తుంది. బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్స్ లో కంటెస్టెంట్ చేసిన సెలెబ్రిటీలు జోడీలుగా బీబీ జోడి డాన్స్ రియాలిటీ షో రూపొందించారు. సీనియర్ యాక్టర్ రాధ, జయం ఫేమ్ సదా జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. అందమైన జంటలు హైవోల్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తుండగా ప్రేక్షకులు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. కాగా మెహబూబ్-శ్రీసత్య లేటెస్ట్ ఎపిసోడ్ లో ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఆడియన్స్ కి కరెంట్ షాక్ ఇచ్చింది. ఆ రేంజ్ లో ఇద్దరు స్టేజి మీద దుమ్మురేపారు.
విక్రమ్ నటించిన మల్లన్న చిత్రంలో శ్రియ శరన్ డాన్స్ చేసిన ‘అలెగ్రా అలెగ్రా’ సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా శ్రీసత్య షార్ట్ ఫ్రాక్ లో ఎలక్ట్రిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మెహబూబ్-శ్రీసత్య మమేకమై సాంగ్ చేశారు. మెహబూబ్ తన కండల్లో శ్రీసత్యను నలిపేశాడు. వారి పెర్ఫార్మన్స్ చూస్తూ జడ్జెస్ సీటులో కూర్చోలేకపోయారు. సదా అయితే లేచి అటూ ఇటూ తిరుగుతూ తలపట్టుకుంది. అంతగా ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మైండ్ బ్లాక్ చేశారు.
బీబీ జోడి ఏదో ఆషామాషీ షో అనుకున్నోళ్ల అనుమానాలు కంటెస్టెంట్స్ పటాపంచలు చేస్తున్నారు. ప్రొఫెషనల్ డాన్సర్స్ ని మించి స్టేజ్ పై కాలు కదుపుతున్నారు. ఒక జోడీని మించి మరొక జోడీ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. అసలు విన్నర్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. మెహబూబ్ బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్నారు. ఇతడు బేసిక్ గా మంచి డాన్సర్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇక శ్రీసత్య సంగతి తెలిసిందే. ఆమె లేటెస్ట్ సీజన్ 6 లో పాల్గొన్నారు. దాదాపు ఫైనల్ కి వెళ్లిన శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆమె ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ కోల్పోయారు.
కాగా శ్రీసత్య పెద్ద మొత్తంలో నెగిటివిటీ మూటగట్టుకుంది. హౌస్లో ఆమె ప్రవర్తన రీత్యా ఆడియన్స్ బీభత్సంగా ట్రోల్ చేశారు. ఇతర కంటెస్టెంట్స్ ని తెలివిగా వాడుకుంటూ ఫైనల్ వీక్ వరకూ వెళ్లారనే వాదన ఉంది. అర్జున్ కళ్యాణ్ శ్రీసత్య మాయలో పడి గేమ్ వదిలేసి ఎలిమినేట్ అయ్యాడు. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాక ఆమె శ్రీహాన్ కి దగ్గరయ్యారు. ఆమె కారణంగా శ్రీహాన్ కూడా నెగిటివిటీ ఎదుర్కొన్నాడు. తన గేమ్ డిస్టర్బ్ అయ్యింది. సిరి ఎంట్రీతో శ్రీహాన్ బుద్ధిని కమ్మేసిన మాయ తొలిగింది. ఫ్యామిలీ వీక్ నుండి గేమ్ మార్చి… టాప్ టు కంటెస్టెంట్ అయ్యాడు.