Chiranjeevi- Trisha: త్రిష తో మరోసారి రొమాన్స్ చెయ్యబోతున్న మెగాస్టార్ చిరంజీవి
సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ చిత్రం లో నటించబోతున్నాడు అనే దానిపై నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ ఉండేది.

Chiranjeevi- Trisha: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా మెహర్ రమేష్ దర్శకత్వం లో ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగష్టు 11 వ తారీఖున విడుదల కాబోతుంది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ కి ఈ సినిమా రీమేక్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాట కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ చిత్రం లో నటించబోతున్నాడు అనే దానిపై నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ ఉండేది. ఇప్పుడు ఆ సస్పెన్స్ వీడింది. త్వరలోనే ఆయన ‘భింబి సారా’ దర్శకుడు వశిష్ఠ తో ఒక సినిమా, అలాగే కళ్యాణ్ కృష్ణ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు.
వీటిల్లో ముందుగా వశిష్ఠ తో సినిమాని ప్రారంభించబోతున్నాడు మెగాస్టార్. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష ఖరారు అయ్యినట్టు సమాచారం. గతం లో చిరంజీవి త్రిష తో కలిసి ‘స్టాలిన్’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇదే. త్రిష ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో కెరీర్ లోనే పీక్ స్టేజి లో కొనసాగుతుంది. ప్రస్తుత సౌత్ ఇండియన్ లీడింగ్ స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభం అయ్యింది అనే చెప్పాలి.ఇక పోతే ఈ సినిమాలో డీజీ టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ చిరంజీవి కి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. సిద్దు కి జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుంది.భోళా శంకర్ చిత్రం షూటింగ్ పూర్తి అయినా వెంటనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.
