Megastar Chiranjeevi: రజినీకాంత్ కూతురు దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం?
రీసెంట్ సమయం లోనే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఒక పొలిటికల్ నేపథ్యం ఉన్న స్క్రిప్ట్ ని వినిపించింది అట. ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా సరిసమానం గా ఉంటుందట. చిరంజీవి ఈ కథని ఎంతగానో నచ్చాడని, తన తదుపరి చిత్రం ఇదే అవుతుందని, డేట్స్ ఇవ్వడానికి రెడీ అని సౌందర్య కి చెప్పాడట చిరంజీవి.

Megastar Chiranjeevi- Rajinikanth: ఈమధ్య ఇండస్ట్రీ లో క్రేజీ కాంబినేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. నేటి తరం హీరోల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండడం కారణంగా మల్టీస్టార్ర్ర్ సినిమాలు బాగా సెట్ అయిపోతున్నాయి. దర్శక నిర్మాతలు కూడా ప్రస్తుతం కంటెంట్ కంటే ఎక్కువగా కాంబినేషన్స్ మీదనే ఎక్కువగా ద్రుష్టి పెడుతున్నారు. రీసెంట్ గా మరో క్రేజీ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త బలంగా వినిపిస్తుంది. అసలు విషయం లోకి వెళ్తే సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకురాలు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈమె తమిళం లో పలు సినిమాలకు దర్శకత్వం వహించింది. ఇప్పుడు త్వరలోనే ఆమె తెలుగు లో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తొలిసినిమా మరెవరితోనో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి తోనే అని అంటున్నారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాము.
రీసెంట్ సమయం లోనే మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఒక పొలిటికల్ నేపథ్యం ఉన్న స్క్రిప్ట్ ని వినిపించింది అట. ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా సరిసమానం గా ఉంటుందట. చిరంజీవి ఈ కథని ఎంతగానో నచ్చాడని, తన తదుపరి చిత్రం ఇదే అవుతుందని, డేట్స్ ఇవ్వడానికి రెడీ అని సౌందర్య కి చెప్పాడట చిరంజీవి.
ప్రస్తుతం సౌందర్య తమిళం లో విష్ణు విశాల్ తో ‘లాల్ సలాం’ అనే చిత్రం చేస్తుంది, ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఆయనకీ సంబంధించిన ఫస్ట్ లుక్ రీసెంట్ గానే విడుదల చేసారు మూవీ టీం. ఈ సినిమా తర్వాత సౌందర్య తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవి తోనే ఉంటుందట, ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్న చిరంజీవి, ఈ చిత్రం తర్వాత చేయబోయేది ఇదే అని అంటున్నారు, చూడాలి మరి.