Pawan Kalyan Birthday: నా తమ్ముడైనందుకు గర్వపడుతున్నా..!
నీకు జన్మదిన శుభాకాంక్షలు…” అంటూ తమ్ముడి మీద ఉన్న ఆప్యాయత, అనురాగాలు వ్యక్తం చేశారు. చిరంజీవి వారసుడిగా వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ లో అన్నకు మించి ఎదిగారు. ఆయన సినిమాల రికార్డులు, అశేష అభిమానులు ఇందుకు నిదర్శనం.

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఏ స్థాయికి ఎదిగాడో అన్నయ్య చిరంజీవి భావంలో స్పష్టంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి చిరంజీవి శుభాకాంక్షలు చెప్పిన తీరు మెగా అభిమానులను, జనసేన శ్రేణులను ఆనందంలో ముంచెత్తుతుంది. చిరంజీవి తన జన్మదిన శుభాకాంక్షలు సందేశంలో పవన్ కళ్యాణ్ ఔన్నత్యాన్ని, సమాజహితం కోరే ఆయన మంచి మనసును కొనియాడారు. పవన్ కళ్యాణ్ సంకల్పం సిద్ధించాలని ఆశీర్వదించారు.
ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న జన హృదయ నేత తన తమ్ముడైనందుకు గర్వంగా ఉందని చిరంజీవి మురిసిపోయారు. పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రజా నేతగా ఏ మేరకు ఎదిగారో చెప్పేందుకు చిరంజీవి మాటలు తార్కాణంగా నిలిచాయి. దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలిన చిరంజీవి తమ్ముడు పవన్ కి అన్నగా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. చిరంజీవి సోషల్ మీడియా సందేశం వైరల్ అవుతుంది.
చిరంజీవి సందేశం పరిశీలిస్తే…
”జన హితమే లక్ష్యంగా,
వారి ప్రేమే ఇంధనంగా,
నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ,
ఉన్నత భావాలు , గొప్ప సంకల్పాలు ఉన్న
ఈ జన హృదయ సేనాని
నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు…” అంటూ తమ్ముడి మీద ఉన్న ఆప్యాయత, అనురాగాలు వ్యక్తం చేశారు. చిరంజీవి వారసుడిగా వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ లో అన్నకు మించి ఎదిగారు. ఆయన సినిమాల రికార్డులు, అశేష అభిమానులు ఇందుకు నిదర్శనం.
ఇక కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ఓజీ టీజర్ గూస్ బంప్స్ లేపింది. అభిమానుల అంచనాలకు ఈ ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఉంది. హరి హర వీరమల్లు పోస్టర్ సైతం ఆకట్టుకుంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక మూవీ ప్రకటించారు. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు.
View this post on Instagram
