Chiranjeevi Family: చిరంజీవి కుటుంబంలో అందరూ అమ్మాయిలే… ఆయన కోరిక తీరేదెప్పుడూ?
ఎంత ఆలస్యమైనా ఉపాసన అబ్బాయి కంటే బాగుండని చిరంజీవి కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఓ సందర్భంలో మాట్లాడుతూ.

Chiranjeevi Family: చిరంజీవి ఫ్యామిలీని ఒక సెంటిమెంట్ వెంటాడుతుంది. ఆయనకు మనవడు ఎత్తుకునే అదృష్టం కలగలేదు. ఇద్దరు కూతుళ్ళకు అమ్మాయిలే పుట్టారు. తాజాగా రామ్ చరణ్ కి కూడా అమ్మాయే పుట్టింది. 2012 లో రామ్ చరణ్-ఉపాసన కామినేని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో పెళ్లి గ్రాండ్ గా నిర్వహించారు. పెళ్ళై పదేళ్లు అవుతున్న ఉపాసన తల్లి కాలేదు. దీనికి ఆమె కొన్ని కారణాలు చెప్పుకొచ్చారు. పదేళ్ల వరకు పిల్లల్ని కనకూడని నిర్ణయం తీసుకున్నట్లు ఉపాసన చెప్పారు.
పిల్లలను కనడం ఒక బాధ్యత. పూర్తి స్థాయిలో సన్నధం అయ్యాకే ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని రామ్ చరణ్ నేను అనుకున్నాము. ఈ క్రమంలో ఫ్యామిలీ, సొసైటీ నుండి ఒత్తిడి ఎదురైంది. ఒత్తిడి ఎదురైంది. అయినా తలొగ్గకుండా మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఉపాసన వివరణ ఇచ్చారు. ఇప్పుడు మేము ఆర్థికంగా మానసికంగా సిద్ధంగా ఉన్నాము. పిల్లలకు కోరిన జీవితం అందించగల స్థాయిలో ఉన్నామంటూ ఆమె చెప్పుకొచ్చారు.
ఎంత ఆలస్యమైనా ఉపాసన అబ్బాయి కంటే బాగుండని చిరంజీవి కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఓ సందర్భంలో మాట్లాడుతూ… రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా ఓకే. అయితే అబ్బాయి పుడితే బాగుండు. ఎందుకంటే మా ఫ్యామిలీలో అందరూ అమ్మాయిలే, అబ్బాయి ఒకడు లేడు. అందుకే అబ్బాయిని కోరుకుంటున్నాము, అన్నారు.
చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు కాగా సుస్మితకు ఇద్దరు అమ్మాయిలు. ఇక శ్రీజకు కూడా ఇద్దరు అమ్మాయి పుట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ కి మరో అమ్మాయి. మొత్తం చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు అయ్యారు. ఈ క్రమంలో చిరంజీవికి మనవడు యోగం లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే చిరంజీవి వారసత్వం వస్తే నెక్స్ట్ రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టొచ్చు. చిరంజీవికి మొదట అమ్మాయి అనంతరం అబ్బాయి తర్వాత అమ్మాయి పుట్టింది.
