Lavanya Tripathi: అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను… కంగారు పుట్టిస్తున్న లావణ్య త్రిపాఠి కామెంట్స్
లావణ్య త్రిపాఠి కెరీర్ డల్ అయ్యింది. వరుస ప్లాప్స్ తో ఆఫర్స్ తగ్గాయి. లావణ్య చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు. ఇటీవల కాలంలో ఆమె నటించిన ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే నిరాశపరిచాయి. భలే భలే మగాడివోయ్ తర్వాత ఆమెకు హిట్ లేదు. అర్జున్ సురవరం పర్లేదు అనిపించుకుంది. పులి మేక టైటిల్ తో ఓ సిరీస్ చేసింది. అది కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

Lavanya Tripathi: ప్రతి మనిషికి కొన్ని భయాలు ఉంటాయి. దీన్నే ఇంగ్లీష్ లో ఫోబియా అంటారు. కొందరికి చీకటి అంటే భయం, కొందరికి హైట్స్ అంటే భయం, మరికొందరి బల్లులంటే భయం. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఓ ఫోబియాతో బాధపడుతున్నారట. చాలా కాలంగా ఆమెకు ఈ సమస్య ఉందట. కొన్ని ఆకారాలు చూస్తే లావణ్య త్రిపాఠి ఉలిక్కిపడతారట. అవి ఆమెను తీవ్రంగా భయపెడతాయట. ఆ సమయంలో మానసిక వేదనకు గురవుతారట. ఈ ఫోబియా నుండి బయటపడాలని ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావడం లేదట. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి స్వయంగా చెప్పారు.
లావణ్య త్రిపాఠి కెరీర్ డల్ అయ్యింది. వరుస ప్లాప్స్ తో ఆఫర్స్ తగ్గాయి. లావణ్య చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు. ఇటీవల కాలంలో ఆమె నటించిన ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే నిరాశపరిచాయి. భలే భలే మగాడివోయ్ తర్వాత ఆమెకు హిట్ లేదు. అర్జున్ సురవరం పర్లేదు అనిపించుకుంది. పులి మేక టైటిల్ తో ఓ సిరీస్ చేసింది. అది కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
మెగా కుటుంబంలోకి కోడలుగా వెళుతున్న లావణ్య నటనకు గుడ్ బై చెప్పారని సమాచారం. ఇకపై ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయరట. అయితే నిర్మాతగా చిత్రాలు తెరకెక్కించాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఆమె ప్రొడ్యూసర్ అవతారం ఎత్తనున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. జూన్ 9న వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. రెండేళ్లుగా లావణ్య-వరుణ్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం. సడన్ గా నిశ్చితార్థం అంటూ షాక్ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో వివాహం జరగనుందట. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అందాల రాక్షసి చిత్రంతో నటిగా మారిన లావణ్య మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.