Varun Tej, Lavanya Tripathi :పెళ్లి వాయిదా వేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య.. కారణం అదేనా?
. ఇంట్లో పరిస్థితులు కాస్త కుదురుకున్న తర్వాత, మరోసారి ముహుర్తాలు చూసి పెళ్లి చేయాలని నాగబాబు భావిస్తున్నారట. అంటే నవంబరు-డిసెంబరులో వరుణ్-లావణ్య పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది

Varun Tej, Lavanya Tripathi : ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన మెగా హీరో వరుణ్ తేజ్. ఇక అందాల రాక్షసి చిత్రంతో అందరి మదిలో నిజంగానే అందాల తారగా నిలిచిపోయిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అని తెలియగానే అభిమానులు తెగ సంబరపడిపోయారు.
వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మెగా కుటుంబం మధ్య వీరిద్దరి ఎంగేజ్మెంట్ రంగ రంగ వైభవంగా జరిగింది. ఇక అందరి దృష్టి వీరి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న పైన పడింది.
మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి ఆగస్టు చివర వారంలో అని కొన్నాళ్ల ముందు టాక్ వినిపించింది. అంతేకాకుండా వీరిద్దరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు అనే వార్త కూడా వినిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో ఆ తంతు జరిగేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఎంత డెస్టినేషన్ వెడ్డింగ్ అయినాసరే శుభలేఖలు పంచడం, బ్యాచిలర్ పార్టీలు ఇలా ఏదో ఒకటి జరగాలి. కానీ ఇప్పుడు అలాంటిదేం లేకపోయేసరికి పెళ్లి వాయిదా పడిందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అలానే తేదీ మార్పు వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది
వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఈ మధ్యే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా జరిగి కొన్ని రోజులు కూడా కాకముందే మళ్లీ వెంటనే ఇంట్లో శుభకార్యం అంటే బాగోదని ఆలోచించి, పెళ్లి తేదీలో మార్పు చేసినట్లు సమాచారం. ముందుగా విరి వివాహం ఆగస్టు 24, 25 తేదీల్లో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీలో జరగకపోవచ్చు. ఇంట్లో పరిస్థితులు కాస్త కుదురుకున్న తర్వాత, మరోసారి ముహుర్తాలు చూసి పెళ్లి చేయాలని నాగబాబు భావిస్తున్నారట. అంటే నవంబరు-డిసెంబరులో వరుణ్-లావణ్య పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ఆగితే ఏ విషయమనేది క్లారిటీ వచ్చేస్తుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ ఆగస్టు 25న థియేటర్లలోకి వస్తోంది.
