Matti Kusthi Movie Review: నటీనటులు: విష్ణు విశాల్ , ఐశ్వర్య లక్ష్మి , అజయ్ తదితరులు
దర్శకుడు : చెల్లా అయ్యావు
నిర్మాత : విష్ణు విశాల్ , రవితేజ
మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్

Matti Kusthi Movie Review
తమిళ క్రేజీ హీరో విష్ణు విశాల్ మొదటి నుండి వైవిద్యం ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే..ఇతని సినిమా వస్తుందంటే కచ్చితంగా ఎదో ఒక కొత్తదనం ఉంటుంది అనే అనుభూతిని ప్రేక్షకుల్లో కలిగించాడు..ఈమధ్య ఈయన ప్రొడక్షన్ రంగం లోకి కూడా అడుగుపెట్టి తన సినిమాలను తనే తీసుకుంటున్నాడు..ఇక తెలుగు లో ఈ సినిమాకి మాస్ మహారాజ రవితేజ సమర్పకుడిగా వ్యవహరించడం తో మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి..ప్రొమోషన్స్ కూడా ఇరగదీసారు..అలా భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరుకు అలరించిందో ఒకసారి ఈ రివ్యూ లో చూసేద్దాం.
కథ :
వీర ( విష్ణు విశాల్) ఒక పల్లెటూరు కి చెందిన మోటు మనిషి..అతనికి మగాడిని అనే అహంకారం చాలా ఎక్కువ..పైగా అతని పక్కనే ఉంటూ మేనమామ మెగా అహంకారం ఎక్కిస్తూ ఉంటాడు..అయితే తన జీవిత భాగస్వామికి జడ ఎక్కువగాను మరియు చదువు తక్కువగాను ఉండే విధంగా ఉన్న అమ్మాయిని వెతికిమరీ పెళ్లి చేసుకునే ప్రయత్నం లో ఉంటాడు వీర..మరో వైపు కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటుంది..BSC వరుకు చదువుకున్న కీర్తి ఒక రెజ్లర్..కానీ కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకునేవాడు దొరకడం తో బారెడు జడ, తక్కువ చదువు అని అబద్దం చెప్పి వీర ని పెళ్లి చేసుకుంటుంది..వీర కీర్తిని చాలా గట్టిగా నమ్ముతాడు..మరి ఈ అబద్దాలతో కాపురం ఎలా నడిచింది..? నిజం తెలిసాక జరిగిన పరిణామాలు ఏమిటి అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ సినిమా టైటిల్ ని చూసి ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని అందరూ అనుకుంటారు..కానీ నిజానికి ఇది స్పోర్ట్స్ డ్రామా కాదు..స్పోర్ట్స్ అంశాలతో కూడిన భార్య భర్తల ఆధిపత్య పోరు కథ..సినిమా ప్రారంభం లో కాసేపు..మరియు క్లైమాక్స్ లో కాసేపు స్పోర్ట్స్ డ్రామా కనిపిస్తుంది కానీ..మిగిలిన కథ మొత్తం వినోద భరితంగా సాగిపోతుంది..పెళ్లి చూపుల తతంగం..అబద్దాలు ఆడి పెళ్లి చేసుకోవడం..మళ్ళీ అది నిజం అని నమ్మించడానికి చేసే ప్రయత్నాలు చూసే ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి..ఇక ఈ సినిమాలో పేరుకే విష్ణు విశాల్ హీరో..కథ మొత్తం ఐశ్వర్య లక్ష్మి చుట్టూనే తిరుగుతుంది..ఇందులో ఆమెది చాలా పవర్ ఫుల్ పాత్ర..ఎలివేషన్స్ కూడా ఆమెకి చాలా బాగా పడ్డాయి..విష్ణు విశాల్ తానూ నిర్మాతగా వ్యవహరించిన సినిమాకి ఫిమేల్ ఓరియెంటెడ్ కథ ని ఎంచుకోవడం..తగ్గాల్సిన సన్నివేశాల్లో తగ్గడం మెచ్చుకోదగ్గ విషయం..సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వినోదభరితంగా సాగిపోతుంది..ఫస్ట్ హాఫ్ లోనే నిజం తెలిసిపోవడం తో సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా సీరియస్ నోట్ లో వెళ్ళిపోతుందని అందరూ అనుకుంటారు..కానీ దర్శకుడు సెకండ్ హాఫ్ ని కూడా వినోదభరితంగా తీర్చి దిద్దాడు.

Matti Kusthi Movie Review
కథ రొటీన్ అయ్యినప్పటికీ కూడా స్పోర్ట్స్ డ్రామా కలవడం తో టేకింగ్ లో కాస్త కొత్తదనం కనిపిస్తుంది..అయితే సినిమాటిక్ లిబర్టీ ని మాత్రం ఈ సినిమా ఎక్కడ మిస్ అవ్వలేదు..సెకండ్ హాఫ్ లో మట్టి కుస్తీ నేర్చుకోవడానికి రంగం లోకి దిగిన హీరో, కుస్తీని నేర్చుకొని కోచ్ రేంజ్ కి ఎదిగిన ప్రత్యర్థిని ఓడిస్తాడు..ఇది కాస్త సినిమాటిక్ లిబర్టీ కి దగ్గరగా ఉంటుంది..సినిమా లో కాస్త తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించినప్పటికీ కామెడీ పండడం తో చూసే ప్రేక్షకుడికి మంచి టైం పాస్ అవుతుంది.
చివరి మాట :
వినోదం ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా నచ్చుతుంది..టైం పాస్ కోసం సినిమాకి వెళ్లేవాళ్లు కోసం మట్టికుస్తి ని బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు.
రేటింగ్ : 2.5/5