Maruti Suzuki Wagon R: మారుతి బంపర్ ఆఫర్.. 34 కి.మీల మైలేజ్.. రూ.5 లక్షలకే అదిరిపోయే కారు..
ఈ కంపెనీకి చెందిన మరో మోడల్ లోనూ ఆఫర్లు ప్రకటించారు. ఆల్టో 800 కారుపై రూ.50 వేల తగ్గింపు ప్రయోజనాలు ఉన్ానయి. మారుతి సుజుకీ ఆల్టో కే 10 మోడల్ పై రూ.60 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే మారుతి ఎక్స్ ప్రెస్ కారుపై రూ.65 వేల తగ్గింపు లభిస్తోంది. సెలెరియో కారుపై రూ.65వేలు, స్విఫ్ట్ కారుపై రూ.50 వేలు క్యాష్ రిటర్న్ పొందవచ్చు. డిజైర్ కారుపై రూ.17 వేల క్యాష్ డిస్కౌంట్ ను ప్రకటించారు.

Maruti Suzuki Wagon R: కరోనా కాలం తరువాత కార్ల వినియోగం పెరిగింది. ప్రతి ఒక్కరూ ఫోర్ వీలర్ ను కొని తెచ్చుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దేశీయ కార్ల ఉత్పత్తితో అగ్రగామిగా నిలుస్తున్న మారుతి కంపెనీ ఇప్పటికే ఆకర్షించే కార్లను రోడ్లపై తిప్పుతోంది. మిగతా వాటికంటే తక్కువ ధరలో అందిస్తూ ఇంప్రెస్ కొట్టేసింది. ఇప్పుడు భారీ ఆఫర్లు ప్రకటించి మరింత ఆకట్టుకుంటోంది. మారుతి కంపెనీకి చెందిన కొన్ని కార్లపై దాదాపు రూ.50 వేల వరకు తగ్గింపును ప్రకటిస్తున్నాయి. దీంతో లేటేస్ట్ ఫీచర్లతో కూడిన కొన్ని మోడళ్లు రూ.5 లక్షలకే వస్తున్నాయి. మరి ఆ వివరాలేంటో చూద్దాం..
మారుతి నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ సంచలనాలు సృష్టించింది. అమ్మకాల్లో రోజురోజుకు వృద్ధి సాధిస్తోంది. అయితే ఇప్పుడు ఆ వ్యాగన్ ఆర్ పై కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ కారుపై రూ..49 వేల డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఇది జూలై 31 వరకే వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.5.5 లక్షలతో ఎక్స్ షోరూం ధర ఉంది. డిస్కౌంట్లు వర్తిస్తే మరింత తక్కువకే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మోడల్ ను భట్టి ఆఫర్లు వర్తిస్తాయి. వ్యాగన్ ఆఫర్ ఎలా ఉంటుందంటే.. క్యాష్ డిస్కౌంట్ రూ.25వేలు, ఎక్చేంజ్ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4 వేలు లభిస్తుంది. మొత్తంగా రూ.49 వేలు రిటర్న్ క్యాష్ తీసుకోవచ్చు. ఇక వ్యాగన్ ఆర్ లీటర్ కు రూ.34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కంపెనీకి చెందిన మరో మోడల్ లోనూ ఆఫర్లు ప్రకటించారు. ఆల్టో 800 కారుపై రూ.50 వేల తగ్గింపు ప్రయోజనాలు ఉన్ానయి. మారుతి సుజుకీ ఆల్టో కే 10 మోడల్ పై రూ.60 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే మారుతి ఎక్స్ ప్రెస్ కారుపై రూ.65 వేల తగ్గింపు లభిస్తోంది. సెలెరియో కారుపై రూ.65వేలు, స్విఫ్ట్ కారుపై రూ.50 వేలు క్యాష్ రిటర్న్ పొందవచ్చు. డిజైర్ కారుపై రూ.17 వేల క్యాష్ డిస్కౌంట్ ను ప్రకటించారు.
దేశీయంగా మిగతా కంపెనీల కంటే మారుతి నుంచి వచ్చే మోడళ్లు వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు ఎలాంటి మోడల్ అయినా కంపెనీ రిలీజ్ చేస్తుంది. లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు అప్డేట్ వర్షెన్లతో అలరిస్తున్న మారుతి కంపెనీ ఇప్పుడు భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో వినియోగదారులు ఈ మోడళ్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు.