Maruti Suzuki: మారుతి సుజుకి సంచలనం..
Maruti Suzuki: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి సంచలన రికార్డు సృష్టించింది. వివిధ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చి దేశీయులను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ కార్లు ఇప్పుడు విదేశీయుల మనసును దోచుకుంటున్నాయి. 1986 నుంచి మారుతి కార్లు విదేశాలకు ఎగుమతి అవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో మాత్రమే ఈ కంపెనీకి చెందిన కార్లు అడుగుపెట్టాయి. కానీ ఇప్పుడు పలు దేశాలకు 25 లక్షల కార్లను ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. విదేశీ కార్లు […]


Maruti Suzuki
Maruti Suzuki: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి సంచలన రికార్డు సృష్టించింది. వివిధ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చి దేశీయులను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ కార్లు ఇప్పుడు విదేశీయుల మనసును దోచుకుంటున్నాయి. 1986 నుంచి మారుతి కార్లు విదేశాలకు ఎగుమతి అవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో మాత్రమే ఈ కంపెనీకి చెందిన కార్లు అడుగుపెట్టాయి. కానీ ఇప్పుడు పలు దేశాలకు 25 లక్షల కార్లను ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. విదేశీ కార్లు హల్ చల్ చేస్తున్న తరుణంలో మారుతి విదేశాలకు ఇంత పెద్దమొత్తంలో ఎగుమతి చేయడం సంచలనంగా మారిందని మోటార్ ఫీల్డ్ నిర్వాహకులు చర్చలు పెట్టుకుంటున్నారు.
మారుతి సుజుకి 1986-87 మధ్యలోనే విదేశాకు కార్ల సరఫరా చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి వివిధ మోడళ్లన్నింటిని ఆయా దేశాలకు పంపిస్తున్నామని కంపెనీ ఎండీ హిసషి టకెయుచి అన్నారు. మొదటి కన్సైన్మెంట్ కిద 500 కార్లను హంగేరికి ఎక్స్ పోర్టు చేశారు. ఈ 35 ఏళ్లల్లో 100 దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. హై క్వాలిటీ, సూపీరియర్ టెక్నాలజీ, రిలయబిలిటీ, పెర్ఫామెన్స్, అపోర్టబిలిటీ వంటి కారణాలతో గ్లోబల్ కస్టమర్లు తమ కంపెనిని ఆదరిస్తున్నారిన టకెయుచి తెలిపారు.
ఇలా ఇప్పటి వరకు 25 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు పేర్కొన్నారు. 25 లక్షవ వాహనాన్ని సుజుకీ బాలెనోని గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు ఎగుమతి చేశామన్నారు. 25 లక్షల కార్లను ఎగుమతి చేయడం ఇండియా మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీకి నిదర్శనమని కంపెనీ యాజమాన్యం తెలుపుతోంది. ఇవే కాకుండా ఇండియా నుంచి ప్యాసెంజర్ వెహికిల్స్ఎగుమతుల్లో మారుతి వెహికిల్ష్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయని టకెయుచి తెలిపారు.

Maruti Suzuki
ఇదిలా ఉండగా ఈ ఏడాది టాటా మోటార్ష్, హ్యుండాయ్ సేల్స్ కంటే మారుతి సేల్స్ ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. 2015లో తమ నెక్సా రిటైల్ స్టోర్లను ప్రారంభించగా వీటిలో బాలెనో, ఇగ్నీస్, సియాజ్, ఎక్స్ ఎల్ 6, గ్రాండ్ విటారా వంటి మోడళ్లను విక్రయిస్తున్నాయి. వ్యాగర్ ఆర్ నుంచి మరికొన్ని మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మారుతిని ఆదరిస్తున్నందున వాహనదారుల అభిరుచికి అనుగుణంగా అప్డేట్ వెర్షన్లతో కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
