Maruti Suzuki Cars: క్యాష్ డిస్కౌంట్ రూ.35వేలు.. ఎక్చేంజ్ బోనస్ రూ.15 వేలు.. ‘మారుతి’ బంఫర్ ఆఫర్..
మారుతి ఇగ్నీస్ కారుపై కంపెనీ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు అందిస్తోంది. అలాగే ఎక్చేంజ్ చేస్తే రూ.15 వేల బోనస్ వస్తుంది. అలాగే అదనపు డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4 వేలు ఇస్తోంది. ఇవే కాకుండా స్క్రాపేజీ డిస్కౌంట్ రూ.5 వేలు అందిస్తుంది. మొత్తంగా రూ.49,500 వరకు రిటర్న్ పొందవచ్చు. ప్రస్తుతం ఇగ్నిస్ కారు రూ.5.8 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

Maruti Suzuki Cars: కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగం పెరిగిపోతుంది. వినియోగదారులు తమ అవసరాల రీత్యా అనువైన ఏదో ఒక కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు సైతం రకరకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఆకర్షిస్తున్నాయి. ఇదే సమయంలో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా మారుతి సుజుకీ కంపెనీ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇగ్నోస్, బాలెనో కార్లు కొనుగోలు చేయాలనుకుంటే భారీ డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. వివిధ రకాలుగా దాదాపు రూ.50 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మారుతి ఇగ్నీస్ కారుపై కంపెనీ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు అందిస్తోంది. అలాగే ఎక్చేంజ్ చేస్తే రూ.15 వేల బోనస్ వస్తుంది. అలాగే అదనపు డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.4 వేలు ఇస్తోంది. ఇవే కాకుండా స్క్రాపేజీ డిస్కౌంట్ రూ.5 వేలు అందిస్తుంది. మొత్తంగా రూ.49,500 వరకు రిటర్న్ పొందవచ్చు. ప్రస్తుతం ఇగ్నిస్ కారు రూ.5.8 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
మారుతి ఇగ్నీస్ ఫీచర్ విషయానికొస్తే 1197 సీసీ ఇంజన్ కలిగి ఉంది. 81.8 బీహెచ్ పీపవర్ తో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అవుతుంది. కిలోమీటర్ కు 20.89 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఫ్యూయల్ కలిగిన ఈ మోడల్ లో రక్షణ కోసం రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఈ మోడల్ లో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ లను ఉన్న ఇది సిగ్మా, డెల్టా, జీటా, అల్ఫా అనే నాలుగు ట్రిమ్ లలో వస్తుంది. ఇక ఇందులో ఆరు మోమోటోన్, మూడు డ్యూయల్ టోన్ రంగుల్లో లభ్యమవుతోంది.
ఇగ్నిస్ మాత్రమే కాకుండా ఇదే కంపెనీ నుంచి రిలీజ్ అయినా బాలెనో కారుపై ఆఫర్లు ప్రకటించింది. ఈ మోడల్ పై క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్చేంజ్ బోనస్ రూ.10వేలు,స్క్రాపేజ్ డిస్కౌంట్ రూ.5 వేల వరకు లభిస్తుంది. ఇవే కాకుండా సియాజ్ కారుపై కూడా రూ.33 వేల డిస్కౌంట్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఆపర్లు 2023 జూలై వరకు మాత్రమే ఉంటాయని మారుతి సుజుకి ప్రతినిధులు తెలిపారు.