Maruti Suzuki: కారు లవర్స్‌కు మారుతి సుజుకీ బంపర్ ఆఫర్..!
మారుతీ ఇగ్నిస్ కారుపై రూ.69 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేల వరకు ఉంటుంది. ఎక్సే్చంజ్ డిస్కౌంట్ రూ.15 వేల వరకు ఉంటుంది. ఎక్సే్చంజ్ బోనస్ రూ.10 వేలు ఉంది. స్క్రాపేజ్ బోనస్ రూ.5 వేలు, ఐఎస్‌ఎల్ ఆఫర్ రూ.4 వేలు లభిస్తోంది.

Maruti Suzuki: మీరు కారు లవర్సా… కొత్త కారు కొనే ప్లానింగ్‌లో ఉన్నారా?.. మారుతీ కారు కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం మారుతి కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ కార్లపై కస్టమర్లకు వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ పమిత కాలమే ఉంటుందని పేర్కొంది.
నెక్సా మోడళ్లపై భారీ డిస్కౌంట్..
మారుతీ సుజుకీ ఇండియా తన నెక్సా మోడళ్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. కొత్తగా కారు కొనే ప్లానింగ్‌లో ఉన్న వారు ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. మిగతా కార్లపై కూడా భారీగా తగ్గింపు ఆఫర్ ఇస్తుంది. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటుంది.
డిస్కౌంట్స్ ఇలా..
– మారుతీ సుజుకీ తన మారుతీ బాలెనో కారుపై రూ.35 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేల వరకు ఉంది. ఎక్సే్చంజ్ ఆఫర రూ.10 వేలు, స్క్రాపేజ్ బోనస్ రూ. 5 వేలు వంటివి కలిసి ఉన్నాయి.
– మారుతీ సియాజ్ కారుపై రూ.33 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఇందులో ఎక్సే్చంజ్ బోనస్ రూ.25 వేల వరకు ఉంది. స్క్రాపేజ్ బోనస్ రూ.5 వేలు ఉంటుంది. ఐఎస్‌ఎల్ ఆఫర్ రూ. 3 వేలు లభిస్తుంది. అయితే ఈ కారుపై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో లేదు.
– మారుతీ ఇగ్నిస్ కారుపై రూ.69 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేల వరకు ఉంటుంది. ఎక్సే్చంజ్ డిస్కౌంట్ రూ.15 వేల వరకు ఉంటుంది. ఎక్సే్చంజ్ బోనస్ రూ.10 వేలు ఉంది. స్క్రాపేజ్ బోనస్ రూ.5 వేలు, ఐఎస్‌ఎల్ ఆఫర్ రూ.4 వేలు లభిస్తోంది.
ప్రాంతాలను బట్టి డిస్కౌంట్ మారే చాన్స్..
అయితే ఇక్కడ కారు కొనుగోలుదారులు ఒక విషయం గుర్తించుకోవాలి. కారు డిస్కౌంట్ ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్‌షిప్, కారు మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల కొత్తగా కారు కొనే వారు దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ వివరాలను పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. లేదంటే చేతి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి రావొచ్చు. కేవలం మారుతీ సుజుకీ మాత్రమే కాకుండా నిస్సాన్ ఇండియా, హోండా కార్స్ వంటి కంపెనీలు కూడా జూన్‌లో ఆఫర్లను ప్రకటించాయి. అందువల్ల కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారు ఈ కంపెనీల ఆఫర్లను కూడా చెక్ చేసుకుంటే మంచిది.
