Maruti Suzuki Alto: ఆ కారుకే ఇండియాలో డిమాండ్ ఎక్కువ..!
మారుతీ సుజుకి ఆల్టో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గత రెండు దశాబ్దాలలో 45 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది.

Maruti Suzuki Alto: ఇండియాలో ఒకప్పుడు కారు అంటే సంపన్నులకే ఉంటుంది అన్న భావన ఉండేది. కానీ మారుతున్న కాలం.. కాలంతోపాటు పరిగెత్తాల్సి రావడం.. పెరుగుతున్న అవసరాలు.. ఇలా అనేక కారణాలతో సగటు మనిషి కూడా వేగానికి అలవాడు పడుతున్నాడు. దీంతో అప్పో సప్పో చేసి కార్లు కొంటున్నారు. మరోవైపు ఆదాయం కూడా పెరగడం కార‍్ల కొనుగోలుకు కలిసి వస్తోంది. అయితే మన ఇండియన్స్ ఫారినర్స్‌లా ఖరీదైన కార్లు కాకుండా మీడియం రేంజ్ కార్లు ఎక్కువగా కొంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
మారుతీ సుజుకీకి
మారుతీ సుజుకి ఆల్టో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గత రెండు దశాబ్దాలలో 45 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తమ ఆల్టో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని మారుతి సుజుకి ప్రకటించింది. ఆల్టో బ్రాండ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వివిధ మోడళ్లున్న సంగతి తెలిసిందే. గడచిన 23 ఏళ్లలో 45 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై ఆల్టో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించిందని మారుతి పేర్కొంది. కీలకమైన మైలు రాయిని అధిగమించినందుకు సంతోషంగా ఉందన్న మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్టో అద్భుతమైన ప్రయాణం చాలా గర్వంగా ఉంది. 45 లక్షల కస్టమర్ మైలురాయి అంటే ఇప్పటి వరకు ఏ ఇతర కార్ బ్రాండ్ సాధించలేని ఘనత అని అన్నారు.
23 ఏళ్ల క్రితం లాంచ్..
దేశంలో మారుతి ఆల్టో 2000 సంవత్సరంలో లాంచ్ అయింది. అంటే 23 ఏళ‍్ల క్రితం అన్నమాట. 2010లో మారుతి ఆల్టో కె10, ఆల్టో సీఎన్‌జిలను విడుదల చేసింది. 2012 నాటికి 20 లక్షల యూనిట్లకుపైగా విక్రయించింది. 2012 సంవత్సరంలో ఆల్టో 800ని విడుదల చేసింది, ఆ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెండో తరం ఆల్టో కె10ని విడుదల చేసింది. 2016లో ఆల్టో 30 లక్షల అమ్మకాల సంబరాలను జరుపుకుంది. 2020లో అమ్మకాలు 40 లక్షల యూనిట్ల మార్కును అధిగమించాయి. గతేడాది కంపెనీ మూడవతరం ఆల్టో కె10ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం పెట్రోల్ , సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది.
