Abhirami: పెళ్ళై 14 ఏళ్ళు అవుతున్నా పిల్లలు లేరు… ఆ స్టార్ హీరోయిన్ ఏం చేసిందంటే?
మదర్స్ డే నాడు ఈ విషయాన్ని అభిరామి ప్రపంచానికి తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ లో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. డియర్ ఫ్రెండ్స్ రాహుల్, నేను తల్లిదండ్రులమయ్యామని చెప్పేందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఒక పాపను దత్తత తీసుకున్నాము. పాప పేరు కల్కి.

Abhirami: మాతృత్వం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలి, అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడతారు. ఆ కోరిక తీరిక పోతే వేదన వర్ణనాతీతం. సొసైటీలో కూడా పిల్లలు లేని పేరెంట్స్ ని భిన్నంగా చూస్తారు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. హీరోయిన్ అభిరామికి ఇదే సమస్య ఏర్పడింది. పెళ్ళై దశాబ్దం దాటిపోయినా అభిరామికి పిల్లలు కలగలేదు. దీంతో ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ పాపను దత్తత తీసుకున్నారు.
మదర్స్ డే నాడు ఈ విషయాన్ని అభిరామి ప్రపంచానికి తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ లో ఈ మేరకు పోస్ట్ పెట్టారు. డియర్ ఫ్రెండ్స్ రాహుల్, నేను తల్లిదండ్రులమయ్యామని చెప్పేందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఒక పాపను దత్తత తీసుకున్నాము. పాప పేరు కల్కి. గత ఏడాది కల్కిని దత్తత తీసుకున్నాము. మా జీవితాన్ని ఈ పరిణామం మార్చేసింది. తల్లిగా నేను మదర్స్ డే జరుపుకుంటున్నాను. మీ ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాను… అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
2009లో రాహుల్ పవనన్ అనే వ్యక్తిని అభిరామి వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం కలగలేదు. దీంతో పాపను అడాప్ట్ చేసుకున్నట్లు తాజాగా వెల్లడించారు. అభిరామి అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేరళ అమ్మాయి అయిన అభిరామి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. 1999లో విడుదలైన పత్రం మూవీతో హీరోయిన్ అయ్యారు.
తెలుగులో అభిరామి తక్కువ నటించారు. థాంక్ యూ సుబ్బారావు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభిరామి వేణు తొట్టెంపూడికి జంటగా చెప్పవే చిరుగాలి మూవీలో నటించారు. ఈ రొమాంటిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ పెద్దగా ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని మూవీలో క్యారెక్టర్ రోల్ చేశారు. రవితేజ తల్లి పాత్రలో కొద్దిసేపు కనిపించారు. ప్రస్తుతం ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. ఓ తమిళ, మలయాళ చిత్రంలో అభిరామి నటిస్తున్నారు.
View this post on Instagram
