
March 18 – Indian Cricket history
March 18 – Indian Cricket history: మార్చి 18 భారత క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు గతంలో భారత అభిమానులకు కనువిందు చేశాయి. ఒకటి ఉత్కంఠకే ఊపిరి అందనివ్వని సందర్భం అయితే.. మరొకటి మనసును తేలిక పరిచేది. ఇంకొకటి కాస్త బాధను మిగిల్చిన ఘటన.
సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు ఓ క్రికెట్ శిఖరం తన ఆటకు వీడ్కోలు పలకగా.. అదే మ్యాచ్లో యువ ఆటగాడు తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఐదేళ్ల క్రితం మళ్లీ ఇదే రోజు స్టార్ ప్లేయర్ మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఆ క్రికెట్ శిఖరం సచిన్ టెండుల్కర్ కాగా.. ఆ యువ కెరటం విరాట్ కోహ్లీ. ఇక ఆ మధురానుభూతి అందించింది మాత్రం దినేష్ కార్తీక్. ఆ మ్యాచ్ల వివరాలేంటో ఒకసారి చూసేద్దాం.

March 18 – Indian Cricket history
సరిగ్గా 11 ఏళ్ల క్రితం (2012 మార్చి 18) ఇదే రోజు భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో చివరి వన్డే ఆడాడు. ఆసియా కప్ 2012లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన నాటి మ్యాచ్లో అద్భుత బ్యాటింగ్ తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13 బంతులు మిగిలి ఉండగానే
చేదించింది. తన ఆఖరి వన్డేలో సచిన్ (52) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ కెరటం విరాట్ కోహ్లీ 183 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అప్పుడప్పుడు కెరీర్ ప్రారంభించిన విరాట్ ఇన్నింగ్స్ తో ఎంతటి భయంకరమైన ఆటగాడినో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ఈ టోర్నీలోనే సచిన్ బంగ్లాదేశ్ పై శతకం చేసి 100 సెంచరీలను పూర్తి చేసుకున్నాడు.
థ్రిల్లింగ్ విక్టరీ..
ఇక రెండోది 2018 మార్చి 18. బంగ్లాదేశ్ తో నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. రోహిత్ శర్మ సారధ్యంలో భారత జట్టు థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో బెటర్న్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సెన్సేషనల్ నాక్ తో ఓటమి నుంచి విజయాన్ని అందించాడు. రోహిత్ సేన గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్.. బౌలర్గా సౌమ్య సర్కార్. ఉత్కంఠ కే ఊపిరి అందని క్షణం అది. విజయం ఎవరిని వరిస్తుందో తెలియని సందర్భం. క్లిష్ట స్థితిలో తన అనుభవాన్ని అంతా రంగరించిన దినేష్ కార్తీక్ అద్భుత శిక్షతో విజయాన్ని అందించాడు. ఒక్కసారిగా భారత్ శిబిరంలో ఆనందం.. ఆ క్షణం యావత్ భారతదేశానికి దినేష్ కార్తీక్ హీరో అయ్యాడు. ఈ ఒక్క సిక్స్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో రాని గుర్తింపును కార్తీక్ కు తెచ్చిపెట్టింది. ఈ మ్యాచ్లో కార్తీక్ 8 బంతుల్లో మూడు శిక్షలు రెండు ఫోర్ లతో 28 పరుగులతో అజయంగా నిలిచాడు. ఈ పెర్ఫార్మెన్స్ అతని 2019 వరల్డ్ కప్ టీం లోకి తీసుకునేలా చేసింది.