Natu Natu Song: జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ విరగదీయవచ్చు.. రామ్ చరణ్ తేజ్ దుమ్ము లేపవచ్చు.. మ్యూజిక్ కంపోజర్ రెచ్చిపోయే రేంజ్ లో ఇవ్వచ్చు.. పాట సరైన సందర్భంలో పడి హిట్ అవ్వచ్చు.. మరి ఆ పాట జనంలోకి విస్తృతంగా వెళ్లాలంటే మంచి కొరియోగ్రాఫర్ కావాలి.. మంచి సింగర్ కావాలి. రైటర్ కావాలి.. పోనీ ఆ పాటకు అలా బాగా కుదరాలి.. ఇది కామన్ సెన్స్.. సినీ మేకర్లు అవలంబించే మినిమం సెన్స్

keeravani
ఎస్… గోల్డెన్ క్లబ్ అవార్డు గెలుచుకుంది.. ప్రైవేట్ ఎంట్రీలో ఆస్కార్ జాబితాకు కూడా ఎక్కేసింది.. అవార్డు వస్తుందా? రాదా? నీది పక్కన పెడితే… సినిమా దర్శకుడికి దక్కే ఖ్యాతిని పక్కన పెడితే… డ్యాన్స్ చేసిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనపెడితే… ట్యూన్లు ఇచ్చిన కీరవాణి ఒక్కడే ఆ అవార్డు అందుకున్నాడు.. అంతేకాదు గత కొంతకాలంగా మీడియా తనని ఫోకస్ చేస్తోంది.. నిజంగా ఆ క్రెడిబిలిటీ మొత్తం తనొక్కడిదేనా? తనక్కడి మెజారిటీయేనా? తనొక్కడి మెరిటేనా?
కాదు… ముమ్మాటికీ కాదు..మ నిజం చెప్తే కొందరికి నచ్చకపోవచ్చు.. అది నిష్టూరంగా అనిపించవచ్చు. నాటు నాటు పాటలో ఎన్నైనా అతిశయోక్తులు ఉండవచ్చు గాక. సినిమా కాలానికి సంబంధించి సంబంధం లేని పదాలు ఉండవచ్చు గాక.. కానీ ఆ పాట రాసింది చంద్ర బోస్.. ఆ పాట మీద చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి.. ఆ పాట గోల్డెన్ గ్లోబ్ దాకా వెళ్ళినప్పుడు.. అలా వెళ్లాలి అనుకునేలా రాజమౌళి చేసినప్పుడు… ఆ క్రెడిట్ లో కొంతైనా చంద్రబోస్ కు దక్కాలి.. అది న్యాయం కూడా.. తను బయట ఏవో యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ పాట క్రెడిట్ తనదే అని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడు.. ఈ సమయంలో చిరంజీవి సన్మానించాడు.. కానీ ఆ సినిమా టీం ముఖ్యుల నుంచి గుర్తింపు రాలేదు.. ఆ చంద్రబోసుడు కనీసం సోషల్ మీడియా ట్వీట్ కు కూడా నోచుకోలేదు.

keeravani
మరోవైపు ఆ పాట పాడిన సింగర్స్ కూడా ప్రధానమే.. అందులో ఒకరు కాలభైరవ.. ఎలాగూ ఆయన కీరవాణి కొడుకే. తండ్రి ఘనత చూసి ఆనందిస్తున్నాడు.. తనకు సరైన ప్రశంసలు దక్కినా, దక్కకపోయినా పెద్దగా పట్టించుకోడు.. మరో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాటేమిటి? ఎవడు విషయంలో తనకు కవరేజ్ వచ్చి గనుక ఉంటే జీవితకాల పురస్కారం లాగా ఉండిపోయేది.. ఈ పాటకు సంబంధించి ఒక ట్రాక్ మాత్రమే పాడించారట… తర్వాత దాన్నే కొనసాగించారు.
ఈ పాట ఈ స్థాయిలో విజయవంతం కావడానికి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ప్రధాన కారణం.. ఇందులో తన ప్రయాస చాలా పెద్దది.. ఈ పాట షూటింగ్ ఏకంగా 65 రోజుల పాటు సాగింది.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కంటే ముందే ఉక్రెయిన్ లోనే ఈ షూటింగ్ జరిగింది.. 2021 లో మారిన్ స్కై ప్యాలెస్ లో పాట షూటింగ్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అనుమతి ఇచ్చాడు.. ఎందుకంటే తను కూడా స్వతహాగా ఆర్టిస్ట్ కాబట్టి . అప్పటికే తెలుగు తమిళం కలిపి 70 సినిమాలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ ఈ పాట కోసం 80 రకాల వేరియేషన్లు క్రియేట్ చేసాడు రక్షిత్.. 18 రీటే క్ లు తీసుకున్నారు యాక్టర్స్. ఒక నెలలో 97 డ్యాన్స్ మూమెంట్స్ రూపొందించడం అంటే మాటలు కాదు. ఇంత కష్టపడిన రక్షిత్ ది ఓ ట్రాజెడీ స్టోరీ.. ఆయన తండ్రి వజ్రాల వ్యాపారి. కారణాలు తెలియవు గాని ప్రేమ రక్షిత్ ఫ్యామిలీతో విడిపోయి బతుకుతున్నా… 1993 ప్రాంతంలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టి ఓ టైలర్ షాప్ పెట్టుకున్నాడు. తండ్రి కూడా డాన్స్ అసిస్టెంట్ గా మారాడు.. ఒక దశలో రక్షిత్ ఈ ఆర్థిక కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్యకూ సిద్ధపడ్డాడు.. “ఓరేయ్ ఓ సినిమాలో నీకు ఫుల్ మూవీ కొరియోగ్రఫీ ఛాన్స్ వచ్చింది”.. అని తండ్రి ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇదే ప్రేమ్ రక్షిత్ కు రాజమౌళి ఛత్రపతి సినిమాతో గుర్తింపు వచ్చింది.. ఆ రాజమౌళితో అనుబంధం అలాగే కొనసాగింది.. ఒక రాజమౌళి, ఒక కీరవాణి కి తోడుగా రామ్ చరణ్, ఎన్టీఆర్… వీరంతా దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. ప్రమోషన్లు చేసుకుంటున్నారు.. వారికి మీడియా ఇస్తున్న కవరేజ్ అంతా ఇంతా కాదు.. మరి ఈ పాటకు నిజమైన హీరోలైన చంద్రబోస్, రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్ కు మీడియా సరైన కవరేజ్ ఇచ్చిందా? సరైన గుర్తింపు లభించిందా? అంటే లేదు అని చెప్పాలి..
ఇందులో రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విజేత.. నాయి బ్రాహ్మణుడు.. ప్యూర్ హైదరాబాదీ.. ఇక చంద్రబోస్ వరంగల్ ప్రాంతీయుడు.. ఇక ప్రేమ్ రక్షిత్ తమిళనాడుకు చెందిన వాడు.. ఈ లెక్కన చూసుకున్న వీరికి మాత్రం అన్యాయం జరిగింది..ఆర్ ఆర్ ఆర్ టీం జపాన్ వెళ్ళింది.. ఇప్పుడు అమెరికాలో ఉన్నది.. అంతటి టీంకు వీళ్ళు ముగ్గురు బరువయ్యారా? ఫర్ డిబేట్ సేక్… ఈ బృందం సోషల్ మీడియాలో చేసిన ఫోటోల్లో నిర్మాత శోభు కనిపిస్తున్నారు… వాస్తవానికి ఈ సినిమాకు ఆయనకు ఏ సంబంధమూ లేదు. కనిపిస్తే గునిపిస్తే ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య కనిపించాలి.. పాపం ఆయనను కూడా దూరం పెట్టారు..