Ginna Movie Review: సాలిడ్ మూవీతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని మంచు విష్ణు చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో జిన్నా అంటూ థియేటర్స్ లో దిగిపోయాడు.పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించారు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో కామెడీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జిన్నా ఎలా ఉందో చూద్దాం.

manchu vishnu
నటీనటులు: విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, నరేష్
డైరెక్టర్: సూర్య
నిర్మాత: మంచు విష్ణు
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ :ఛోటా కె. నాయుడు
విడుదల తేదీ: 21-10-2022
కథ:
తిరుపతికి చెందిన జిన్నా(మంచు విష్ణు) టెంట్ హౌస్ నడుపుతూ ఉంటాడు. తన వ్యాపారం కోసం స్థానిక రౌడీ వద్ద అప్పు చేస్తాడు. అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో సదరు రౌడీ ఆగ్రహానికి గురవుతాడు. వాడి నుండి ప్రాణహాని ఉందని తెలుసుకున్న జిన్నా పరారవుతాడు. జిన్నాను వెతికి పట్టుకున్న రౌడీ నా చెల్లిని పెళ్లి చేసుకుంటే అప్పు తీర్చాల్సిన అవసరం లేదని ఒప్పందం చేసుకుంటాడు. దాంతో చేసేది లేక రౌడీ చెల్లిని వివాహం చేసుకుంటాడు. పెళ్లి తర్వాత ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. కొత్త సమస్యలు మొదలవుతాయి. మరి ఈ సమస్యల నుండి జిన్నా ఎలా తప్పించుకున్నాడనేది మిగతా కథ
విశ్లేషణ:
హిట్టు కోసం మొహమాసిపోయి ఉన్న విష్ణు జిన్నా మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా సక్సెస్ రుచి చూడాలని కష్టపడ్డాడు. దీని కోసం గతంలో కలిసొచ్చిన కామెడీ రొమాంటిక్ జోనర్ ఎంచుకున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా విడుదలైన ఢీ ఆయన కెరీర్లో అతి పెద్ద హిట్ గా ఉంది. ఆ మూవీ ఛాయలు జిన్నా లో చూడవచ్చు. మంచు విష్ణు యాక్టింగ్ కూడా ఢీ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. మంచు విష్ణు కామెడీ టైమింగ్, హీరోయిన్స్ తో రొమాన్స్ మెప్పిస్తాయి. ఇక హీరోయిన్స్ గ్లామర్ జిన్నా సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ. సన్నిలియోన్ అందాలు ఆస్వాదించవచ్చు. పాయల్ తన పరిధి మేర పర్వాలేదు అనిపించింది.
జిన్నా మూవీలో అలరించే కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అయితే రొటీన్ కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. ఒక కామెడీ సీన్ తర్వాత పాట దాన్ని ఫాలో అవుతూ ఓ ఫైట్ ఫార్ములా ఎప్పుడో అవుట్ డేటెడ్ అయిపోయింది. జిన్నా మూవీ ఇదే పాత ఫార్మాట్ లో సాగుతుంది. ఇలాంటి సినిమాలకు కథాబలం అవసరం లేదు. రాసుకున్న సన్నివేశాలు ఆసక్తి కలిగించాయా, కామెడీ నవ్వించిందా, ప్లే ఎంటర్టైనింగ్ సాగిందా అన్నదే ముఖ్యం. ఆ ఎలిమెంట్స్ జిన్నా మూవీలో మిస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ కి బలం చేకూర్చాల్సిన హారర్ సన్నివేశాలు తేలిపోయాయి. మొత్తంగా దర్శకుడు నిరాశాజనకంగా జిన్నా చిత్రాన్ని నడిపారు.

Ginna Movie Review
ప్లస్ పాయింట్స్ :
కొన్ని కామెడీ సన్నివేశాలు
హీరోయిన్స్ గ్లామర్
మైనస్ పాయింట్స్:
కథ
కథనం
సన్నివేశాలు
మ్యూజిక్
సినిమా చూడాలా?వద్దా?
కామెడీ, రొమాన్స్, యాక్షన్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన జిన్నా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే నిరాశపరిచింది. అక్కడక్కడ నవ్వించే కామెడీ సన్నివేశాలు, హీరోయిన్స్ గ్లామర్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ అంశాలు లేవు. మంచు విష్ణు అభిమానులకు మాత్రమే అని చెప్పొచ్చు.
రేటింగ్: 2.5/5