‘వకీల్ సాబ్’ పోస్టర్ పై మంచు మనోజ్ కామెంట్

పవన్ రీ ఎంట్రీ మూవీ టైటిల్, ఫస్టు లుక్ ను చిత్రబృందం సోమవారం విడుదల చేసిన సంగతి తెల్సింది. ఈ మూవీ టైటిల్ ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచింది. పవన్ మూవీని వెల్ కమ్ చేస్తూ అభిమానుల్లో లక్షల్లో ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ అభిమానులతో పలువురు సీని, రాజకీయ ప్రముఖులు ‘వకీల్ సాబ్’ మూవీపై తమ స్పందన తెలియజేస్తున్నారు. అయితే ‘వకీల్ సాబ్’ను వెల్ కమ్ చేస్తూ పెట్టిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. మోహన్ బాబు కుమారుడు మంచు […]

  • Written By: Neelambaram
  • Published On:
‘వకీల్ సాబ్’ పోస్టర్ పై మంచు మనోజ్ కామెంట్

పవన్ రీ ఎంట్రీ మూవీ టైటిల్, ఫస్టు లుక్ ను చిత్రబృందం సోమవారం విడుదల చేసిన సంగతి తెల్సింది. ఈ మూవీ టైటిల్ ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచింది. పవన్ మూవీని వెల్ కమ్ చేస్తూ అభిమానుల్లో లక్షల్లో ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ అభిమానులతో పలువురు సీని, రాజకీయ ప్రముఖులు ‘వకీల్ సాబ్’ మూవీపై తమ స్పందన తెలియజేస్తున్నారు. అయితే ‘వకీల్ సాబ్’ను వెల్ కమ్ చేస్తూ పెట్టిన కామెంట్ ఆసక్తికరంగా మారింది.

మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ నుంచి సినిమాలు రాక చాలారోజులవుతుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. తాజాగా ‘వకీల్ సాబ్’ మూవీపై మంచు మనోజ్ తన స్పందన తెలిపాడు. ‘సంవత్సరంలో ఉన్న పండగలన్నీ అభిమానులు ఒక్కరోజులో జరుపుకునేలా పోస్టర్ ఉందని’ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా త్వరలోనే తెరపై కనిపించనున్న జనసేనాని పవన్ కల్యాణ్ గారికి, వకీల్ సాబ్ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు. అయితే మంచు మనోజ్ ‘జనసేనాని’ అంటూ రాజకీయాలు గుర్తొచ్చేలా కామెంట్ ఆసక్తిని రేపుతోంది.

బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ చిత్రానికి ‘వకీల్ సాబ్’ రీమేక్. ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ రాజకీయాల్లో వెళ్లిన సంగతి తెల్సిందే. రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ ‘వకీల్ సాబ్’తో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సన్నహాలు చేస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నివేథా థామస్, అన్యన్య, నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు