Manchu Manoj Birthday: మంచు బ్రదర్స్ మధ్య కొనసాగుతున్న వార్… తాజా ఘటనతో అందరూ షాక్!
విష్ణు మాత్రం స్పందించలేదు. మనోజ్ కి బర్త్ డే విషెస్ చెప్పలేదు. దానికి బదులు వెన్నెల కిషోర్ ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నాయంటూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు.

Manchu Manoj Birthday: మోహన్ బాబు కుమారులు మనోజ్-విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. దీనిపై ఆ ఫ్యామిలీ మెంబర్స్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. కాకపోతే అవన్నీ చిన్న చిన్న వివాదాలు భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. వీరి మధ్య విబేధాలు సద్దుమణగలేదు, మంచు బ్రదర్స్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారని మరోసారి రుజువైంది. మే 20న మనోజ్ బర్త్ డే. అక్క మంచు లక్ష్మి తమ్ముడికి ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలియజేసింది. మనోజ్ తో దిగిన ఫొటోలతో ఒక వీడియో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
విష్ణు మాత్రం స్పందించలేదు. మనోజ్ కి బర్త్ డే విషెస్ చెప్పలేదు. దానికి బదులు వెన్నెల కిషోర్ ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నాయంటూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ మీద ఒక సెటైరికల్ ట్వీట్ వేశాడు. విష్ణు తమ్ముడు మనోజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడంతో టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. మనోజ్-విష్ణు ఇంకా కాంప్రమైజ్ కాలేదు. గొడవలు అలానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 3న జరిగిన ఈ వివాహానికి విష్ణు దూరంగా ఉన్నారు. మోహన్ బాబు సైతం చివరి నిమిషంలో హాజరయ్యారు. మౌనికతో వివాహానికి మోహన్ బాబు కుటుంబం ఒప్పుకోలేదనే వాదన వినిపించింది. పెళ్లి తర్వాత మనోజ్ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. మౌనికను దక్కించుకునేందుకు పెద్ద యుద్ధమే చేశాను. ఊళ్లు పట్టుకొని తిరిగాను అన్నారు.
కాగా విష్ణు తనపై గొడవపడుతున్న వీడియో నేరుగా సోషల్ మీడియాలో పెట్టి మనోజ్ గొడవలపై స్పష్టత ఇచ్చాడు. దీన్ని కవర్ చేసుకోవడానికి విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ పేరుతో చేస్తున్న రియాలిటీ షోలో భాగమే. గొడవ నిజం కాదు. ఫ్రాంక్ అని కవర్ చేసే ప్రయత్నం చేశారు. జనాలు మాత్రం నమ్మలేదు. పరిణామాలు చూస్తుంటే మంచు లక్ష్మి, మనోజ్ ఒక వర్గంగా విష్ణు ఒక్కడే మరొక వర్గంగా తయారయ్యారు. మోహన్ బాబు పిల్లల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయని పలువురి వాదన.