
Lakshmi Manchu
Lakshmi Manchu: మంచు లక్ష్మి అందాల విందులో అసలు తగ్గనంటుంది. వయసుతో సంబంధం లేకుండా హాట్ ఫోజులతో రచ్చ చేస్తుంది. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా జనాలు తమదైన కామెంట్స్ చేస్తున్నారు. ఎర్ర చీర కట్టిన మంచు లక్ష్మి నడుము వంపులు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. నాలుగు పదుల వయసు దాటినా ఆమె పరువాల పదును తగ్గలేదని నిరూపిస్తుంది.
మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్. నటి, టీవీ హోస్ట్, నిర్మాత కూడాను. అమెరికాలో మంచు లక్ష్మి కెరీర్ మొదలైంది. అక్కడ కొన్ని టెలివిజన్ షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. అనగనగా ఒక ధీరుడు మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. సిద్ధార్థ్, శృతి హాసన్ జంటగా నటించిన ఆ చిత్రంలో మంచు లక్ష్మి విలన్ రోల్ చేశారు.
గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించారు. అలాగే పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. తాజాగా ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. అగ్ని నక్షత్రం చిత్రానికి ఆమె నిర్మాత కూడాను. ఈ మూవీ విడుదల సిద్ధం అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచు లక్ష్మి ఒక ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు. మంచు హీరోల మాదిరి ఈమెకు కూడా కలిసి రావడం లేదు.

Lakshmi Manchu
ఇటీవల దగ్గరుండి తమ్ముడు వివాహం చేసింది. మనోజ్, మౌనికల వివాహం మంచు లక్ష్మి నివాసంలో జరిగింది. భూమా మౌనికతో మనోజ్ పెళ్లి నచ్చని మోహన్ బాబు దూరం పెట్టారని సమాచారం. దీంతో అక్క లక్ష్మి మనోజ్ వివాహ బాధ్యత తీసుకున్నారు. మనోజ్ అన్నయ్య విష్ణు పెళ్ళికి దూరంగా ఉన్నారు. ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారట. ఈ క్రమంలో మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు టాలీవుడ్ టాక్.
అయితే గతంలో మంచు లక్ష్మి ఈ వార్తలను ఖండించారు. ఇక మంచు లక్ష్మిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తుంటాయి. అయితే వాటిని ఆమె పట్టించుకోదు. అవన్నీ పనిలేని వాళ్ళు చేసే కామెంట్స్. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఆలోచిస్తే జీవితంలో ఏం చేయలేమంటారు. ఎందరు ఎగతాళి చేసినా నచ్చిన పనులు చేసుకుంటూ ముందుకు పోతుంది.