Manchu Lakshmi : జానెడు గౌనులో మంచు లక్ష్మి స్కిన్ షో… అక్కా మనకు అవసరమా అంటూ ట్రోల్స్!
మరి ఈ రెండు వర్గాల్లో మోహన్ బాబు ఎవరి వైపు అనేది తెలియదు. మనోజ్ వివాహానికి విష్ణు హాజరు కాలేదు. మే 20న మనోజ్ పుట్టినరోజు కాగా విష్ణు శుభాకాంక్షలు చెప్పలేదు. కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వారే నేరుగా ఒప్పుకున్నారు.

Manchu Lakshmi : మంచు వారమ్మాయి కిరాక్ ఫోజులతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ముంబై హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా స్కిన్ షో చేస్తుంది. షార్ట్ ఫ్రాక్ లో గ్లామరస్ ఫోటో షూట్ చేసిన మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. మంచు లక్ష్మి హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో నీకు ఈ డ్రెస్ అవసరమా మంచు అక్కా… అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ కామెంట్స్ ఆమె అసలు పట్టించుకోదు. చాలా కాలంగా మంచు లక్ష్మి ఈ ట్రోల్స్ ఫేస్ చేస్తున్నారు.
మంచు ఫ్యామిలీపై ట్రోల్స్, మీమ్స్ చేసి బ్రతికేసే యూట్యూబ్ ఛానల్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి. పని లేని వాళ్ళు చేసే కామెంట్స్ పట్టించుకుంటే జీవితంలో ఏమీ చేయలేం, అంటారు. కాగా మంచు లక్ష్మి ‘అగ్ని నక్షత్రం’ పేరుతో ఓ మూవీ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అగ్ని నక్షత్రం విడుదలకు సిద్దమవుతుంది. అగ్ని నక్షత్రం చిత్రంలో మోహన్ బాబు కూడా నటించారని వినికిడి. మంచు లక్ష్మి ఈ చిత్రానికి నిర్మాత కూడాను. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇరగదీసింది.
హీరోయిన్ గా ఎదగాలని మంచు లక్ష్మి ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తుంది. ఆమె కల మాత్రం నెరవేరలేదు. గుండెల్లో గోదారి, దొంగాట, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా చేశారు. మోహన్ బాబు ముగ్గురు పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మి పరిశ్రమలో ఎదగలేకపోయారు. ఒక్క స్టార్ కూడా లేని మంచు ఫ్యామిలీ రేసులో వెనుకబడిపోయింది. ఈ ఫ్యామిలీకి పరిశ్రమలో ప్రాతినిధ్యం లభించడం లేదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మోహన్ బాబు ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా హాజరు కాలేదు.
దానికి తోడు ఫ్యామిలీలో అంతర్గత కలహాలు చోటు చేసుకున్నాయి. మంచు బ్రదర్స్ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపు… విష్ణు మరొకవైపు చేరారు. మరి ఈ రెండు వర్గాల్లో మోహన్ బాబు ఎవరి వైపు అనేది తెలియదు. మనోజ్ వివాహానికి విష్ణు హాజరు కాలేదు. మే 20న మనోజ్ పుట్టినరోజు కాగా విష్ణు శుభాకాంక్షలు చెప్పలేదు. కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వారే నేరుగా ఒప్పుకున్నారు.
View this post on Instagram