Manchu Lakshmi : నేను ఎంజాయ్ చేస్తా నీకేంట్రా నొప్పి, వంటింట్లో బ్రతకాలా… మంచు లక్ష్మి సంచలన వీడియో వైరల్!
. జీవితం చాలా చిన్నది. చిటికలో ముగుస్తుంది. ఎవరికోసమో బ్రతకాలా అంటూ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసింది. మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ అవుతుంది.

Manchu Lakshmi : మంచు లక్ష్మి సంచలన వీడియో వైరల్ అవుతుంది. హేటర్స్ పై ఆమె విరుచుకుపడ్డారు. మంచు లక్ష్మి ఏం చేసినా ట్రోల్ చేస్తుంటారు జనాలు. తాజాగా ఆమె ఎయిర్ పోర్ట్ లో శుభ్రతను ప్రశ్నిస్తూ ట్వీట్ వేసింది. బిజినెస్ క్లాస్ కి వెళ్లే దారిలో కూడా కార్పెట్స్ అపరిశుభ్రంగా ఉన్నాయి. నా ఐఫోన్ వాటిని బెటర్ గా చూపిస్తుంది. రియాలిటీలో ఇంకా దారుణంగా ఉన్నాయి… అంటూ వీడియో షేర్ చేసింది. ఆ ట్వీట్ లో మంచు లక్ష్మి తన లగ్జరీ లైఫ్ గురించి చెబుతున్నట్లు నెటిజెన్స్ ఫీల్ అయ్యారు.
అంటే నువ్వు బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నావ్, ఐఫోన్ వాడుతున్నావ్ అని మాకు తెలియలనా ఈ ట్వీట్. నీకేమీ డబ్బులు ఉన్నాయి. ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు కామెంట్స్ పెట్టారు. నెగిటివ్ కామెంట్స్ పై స్పందిస్తూ మంచు లక్ష్మి వీడియో పోస్ట్ చేసింది. అవును నేను ఎంజాయ్ చేస్తా మీకేంట్రా నొప్పి. నువ్వేమైనా నాకు డబ్బులు ఇస్తున్నావా? నా కోసం ఖర్చు చేస్తున్నావా? అంటూ ఫైర్ అయ్యింది.
మా నాన్న కానీ అమ్మ కానీ డబ్బులు ఇవ్వడం లేదు. నేను ఎంజాయ్ చేసే ప్రతి రూపాయి నా కష్టార్జితం. నేను కలలు కనకూడదా? మీకు కోరలు ఉండవా? అని ప్రశ్నించింది. నేను ధనికుల కుటుంబంలో పుట్టాను. కానీ ఏదైనా మీకు మీరే సంపాదించుకోవాలని పేరెంట్స్ చెప్పారు. అలానే పెంచారు. అమెరికాలో తిండికి ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. నేను డబ్బుల కోసం కష్టపడతాను, అని మంచు లక్ష్మి అన్నారు.
నాకంటూ కెరీర్ ఉండ కూడదా? ఇంట్లో వంట చేసుకుంటూ ,పిల్లల్ని చూసుకుంటూ, గిన్నెలు తోముతూ బ్రతకాలా?. ఆడవాళ్లు ఏం చేసినా తప్పేనా?. డబ్బు సంతోషం ఇవ్వదు, స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. జీవితం చాలా చిన్నది. చిటికలో ముగుస్తుంది. ఎవరికోసమో బ్రతకాలా అంటూ సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసింది. మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ అవుతుంది.
Money for me buys me freedom not happiness! https://t.co/5BTXDPXNNM pic.twitter.com/5lZcqyEHrt
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 22, 2023
