Viral: కొందరు ఎంత సంపాదించినా లక్ష్మీ దేవి నిలవదు. కొందరు వద్దంటున్నా వారి వద్దకే వెళుతుంది. అలా ఓ సాధారణ ఉద్యోగికి అదృష్టం దరిద్రం పట్టినట్టే పట్టింది. ఎందుకంటే అతడు వద్దు అనుకొని వెళుతుండగా యథాలాపంగా కొన్న లాటరీ టికెట్ అతడికి అదృష్టాన్ని తెచ్చింది. రాత్రికి రాత్రియే కోటీశ్వరుడిని చేసింది.

Lottery
అనుకోకుండా మనం చేసిన పనులే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతాయి. ఊహించని లాభం కలుగజేస్తాయి. తాజాగా అలాంటి అనుభవమే ఓ అమెరికన్ కు ఎదురుకావడం గమనార్హం.అనుకోకుండా ఇంటికి వెళుతూ కొనవద్దనుకొని కొన్న లాటరీ అతడి సుడిని మార్చింది. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.
Also Read: Modi Comments on Agneepath scheme: అగ్నిపథ్ పై లోపల ఉన్నదంతా కక్కేసిన మోడీ..
అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి పని ముగించుకొని ఇంటికి వెళుతున్నాడు. అనుకోకుండా మధ్యలో ఓ లాటరీదుకాణం వద్ద ఆగాడు. ఎలాగో ఆగాం కదా అని గోల్డ్ 50 ఎక్స్ అనే లాటరీ కొనుగోలు చేశాడు. ఇందుకోసం 5 డాలర్లు వెచ్చించాడు. మన ఇండియన్ కరెన్సీలో ఆ టికెట్ విలువ రూ.389.
ఇంటికెళ్లి తీరికగా ఆ లాటరీని స్క్రాచ్ చేశాడు. చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అందులో ఊహించని మొత్తం ఉంది. ఏకంగా 1.5 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. ఇది చూసి నోట మాటరాని అతడు వెంటనే ఆ లాటరీ షాప్ కు పరిగెత్తాడు. లాటరీని క్లెయిమ్ చేసుకునేందుకు దుకాణా దారుతో కలిసి ప్రయత్నించాడు. ఇలా ఊహించకుండా అదృష్ట దేవత లాటరీ రూపంతో తగిలింది. అతడిని రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసేసింది.
Also Read: Accident With Manhole: అసలే వర్షాకాలం.. బయటకెళ్లేముందు ఈ వీడియో చూసి వెళ్లండి.. ఘోరమిదీ!