China Husband: నా కోసం ఎదురు చూడకు.. మళ్లీ పెళ్లి చేసుకో.. ఓ నేరస్తుడి భావోద్వేగ సందేశం.. నెట్టింట్లో వైరల్
ఈ సందర్భంగా జౌ తన భార్యతో తనకు విడాకులు ఇచ్చి మరోకర్ని పెళ్లి చేసుకోవాలని, తన కోసం ఎదురు చూడొద్దని వేడుకున్నాడు. జైలుకి వెళ్తూ వెళ్తూ..ఆమెని కౌగిలించుకంటూ తన కోసం ఎదురు చూడొద్దని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తమ రిలేషన్ ఇక్కడతో ముగిసిపోయింది. మీ అక్కకి మరో పెళ్లి చేయండని తన మరదలికి కూడా చెబుతాడు. తానెప్పటికీ జైలు నుంచి విడుదలకాలేనని కన్నీటిపర్యంతమవుతాడు.

China Husband: ఓ వ్యక్తి 30 ఏళ్ల క్రితం నేరం చేశాడు. ఇన్నాళ్లూ తప్పిచుకున్న అతను.. ఇటీవలే పోలీసులకు పట్టుపడ్డాడు. కోర్టు శిక్ష విధించడంతో అతను జైలుకి వెళ్తూ.. భార్యను నా కోసం ఎదురు చూడకు. మళ్లి పెళ్లి చేసుకో అని భావోద్వేగంగా చెబుతాడు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతోంది.
చైనాలో ఓ హత్య..
‘జౌ’ అనే చైనా వ్యక్తి 1993లో సెంట్రల్ హుబీ ప్రావిన్స్‌లో తన ముగ్గురి స్నేహితులతో కలసి ఒక వ్యక్తిని హత్య చేశాడు. ఆ ఘటన జరిగిన వెంటనే అతడి స్నేహితులు అరెస్టు అయ్యారు. కానీ జౌ మాత్రం పోలీసులకు పట్టుబడలేదు. గత నెలాఖరు వరకు పరారీలోనే ఉన్నాడు. ఇటీవలే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాను జైలుకి వెళ్లడం ఖాయమని తెలిసిన జౌ తన భార్యతో భావోద్వేగంగా మాట్లాడతాడు.
రిలేషన్ ముగిసిందని..
ఈ సందర్భంగా జౌ తన భార్యతో తనకు విడాకులు ఇచ్చి మరోకర్ని పెళ్లి చేసుకోవాలని, తన కోసం ఎదురు చూడొద్దని వేడుకున్నాడు. జైలుకి వెళ్తూ వెళ్తూ..ఆమెని కౌగిలించుకంటూ తన కోసం ఎదురు చూడొద్దని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తమ రిలేషన్ ఇక్కడతో ముగిసిపోయింది. మీ అక్కకి మరో పెళ్లి చేయండని తన మరదలికి కూడా చెబుతాడు. తానెప్పటికీ జైలు నుంచి విడుదలకాలేనని కన్నీటిపర్యంతమవుతాడు. దీంతో ఔ భార్య ఇక మాట్లాడొద్దు అంటూ తన చేతిని జౌ నోటికి అడ్డం పెడుతుంది. అలా మాట్లాడొద్దు. అందుకు తాను ఒప్పుకోనని భార్య తెగేసి చెబుతుంది. ఆ ఘటన అక్కడ ఉన్నవాళ్లందర్నీ కదిలించింది.
30 ఏళ్ల క్రితం నేరం..
ఇక నేరస్తుడు జౌ కూడా తాను 30 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఇప్పడు అరెస్టు కావడం తననెంతో బాధించిందన్నాడు. తాను చేసిన నేరానికి చాలా పశ్చాత్తాప పడుతున్నానంటూ బావురమన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆ నేరం చేశానని, ఐనా తాను అప్పడు అలా చేసి ఉండకూడదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
స్పందిస్తున్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. గుడ్ రిలేషన్‌షిప్ అని.. అన్యోన్య దాంపత్యం అని.. నువ్వు అదృష్టవంతుడివి భయ్యా అని.. రాముడి వెంట సీత వెళ్లినట్లు అంటూ కామెంట్ చేస్తున్నారు.
