Mahesh Babu- Rajamouli Movie: #RRR సినిమాతో మన తెలుగు సినిమాని ఆస్కార్ రేంజ్ కి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.మహేష్ బాబు తో రాజమౌళి సినిమా పదేళ్ల క్రితమే ఖరారు అయ్యింది, కానీ ఇద్దరికీ కమిట్మెంట్స్ ఉండడం తో వాయిదా పడుతూ ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది, ఇది నిజంగా మహేష్ బాబు అదృష్టం అనే చెప్పాలి..ఎందుకంటే రాజమౌళి క్రేజ్ ఇప్పుడు నేషనల్ లెవెల్ దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.

Mahesh Babu- Rajamouli Movie
ఆయన సినిమాలు ఇక నుండి హాలీవుడ్ ఆడియన్స్ కూడా చూస్తారు.హాలీవుడ్ టాప్ చిత్రాలతో ఇక నుండి రాజమౌళి సినిమాలు పోటీ పడతాయి.రాజమౌళి ఆ రేంజ్ కి ఎదిగిన తర్వాత మహేష్ చిక్కాడు..ఇక బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం మన తరం అవుతుందా.అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.
అదేమిటి అంటే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు ఫైనల్ స్టేజికి వచ్చిందట..ఇది వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవ్వరూ చూడనటువంటి యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో ఈ సినిమాని తియ్యబోతున్నట్టు రాజమౌళి ఇది వరకే తెలిపాడు.ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కొనసాగుతుందట.జూన్ నెలలోనే ముహూర్తపు కార్యక్రమాలు ప్రారంభించడానికి రాజమౌళి సిద్ధం అవుతున్నట్టు సమాచారం.అదే రోజున ఈ మూవీ స్టోరీ థీమ్ మరియు కాస్టింగ్ గురించి కూడా చెప్పబోతున్నాడట..ఇందులో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం.

Mahesh Babu- Rajamouli Movie
అయితే ఏదైనా భారీగా ఖర్చుపెట్టే అలవాటు ఉన్న రాజమౌళి , కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం 15 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తునట్టు సమాచారం.ఈ చిత్రానికి నిర్మాతగా KS రామారావు వ్యవహరించబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే..మూవీ బడ్జెట్ దాదాపుగా 400 కోట్ల రూపాయలకు పైగానే ఉండబోతుందని సమాచారం..వచ్చే ఏడాది ప్రారంభం నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది.