Mahesh – Thaman : థమన్ మీద ఫైర్ అవుతున్న మహేష్..? మధ్యలో లేపేయడు కదా!
Mahesh – Thaman : హీరో మహేష్ బాబు పైకి చాలా సైలెంట్ గా కనిపిస్తారు కానీ, మొండోడు. కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. నచ్చితే చంకన ఎక్కించుకు తిరుగుతారు. లేదంటే విసిరి పారేస్తారు. కాదనుకుంటే ఎవరు చెప్పినా ఒప్పుకోరు. కాగా సర్కారు వారి పాట మ్యూజిక్ విషయంలో థమన్ మహేష్ ని నిరాశపరిచాడన్నది నిజం. అల వైకుంఠపురంలో రేంజ్ ఆల్బమ్ ఆశిస్తే అందులో సగం కూడా ఇవ్వలేదు. ఒకటి రెండు సాంగ్స్ మినహాయిస్తే […]

Mahesh – Thaman : హీరో మహేష్ బాబు పైకి చాలా సైలెంట్ గా కనిపిస్తారు కానీ, మొండోడు. కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. నచ్చితే చంకన ఎక్కించుకు తిరుగుతారు. లేదంటే విసిరి పారేస్తారు. కాదనుకుంటే ఎవరు చెప్పినా ఒప్పుకోరు. కాగా సర్కారు వారి పాట మ్యూజిక్ విషయంలో థమన్ మహేష్ ని నిరాశపరిచాడన్నది నిజం. అల వైకుంఠపురంలో రేంజ్ ఆల్బమ్ ఆశిస్తే అందులో సగం కూడా ఇవ్వలేదు. ఒకటి రెండు సాంగ్స్ మినహాయిస్తే అంచనాలు అందుకోలేకపోయాడనే వాదన ఉంది.
దీంతో థమన్ ని ఈసారి మహేష్ వద్దన్నారట. త్రివిక్రమ్ కి ఈ మేరకు సూచన చేశారట. అయితే త్రివిక్రమ్ తన టీమ్ లో ఒకడిగా మారిన థమన్ ని వదులుకోవడానికి ఇష్టపడలేదట. మహేష్ ని ఒప్పించి, థమన్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఎస్ఎస్ఎంబి 28కి కన్ఫర్మ్ చేశారట. అందుకే అప్పట్లో మహేష్-త్రివిక్రమ్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాదని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ గత రెండు సినిమాల నుండి థమన్, పూజా హెగ్డేలను వదలకుండా కొనసాగిస్తున్నారు.
సరే ఎలాగోలా త్రివిక్రమ్ మహేష్ ని కూల్ చేసి థమన్ ని తీసుకుంటే… ఆయన నిర్లక్ష్యం మరోసారి అసహనానికి కారణం అవుతుందట. మూవీ మొదలై ఆరు నెలలు అవుతుంది. విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. థమన్ ఇంతవరకు ఒక్క ట్యూన్ కూడా చేయలేదట. ఇతర వ్యాపకాలతో బిజీగా ఉన్న థమన్ తన చిత్రాన్ని పట్టించుకోవడం లేదని మహేష్ బావిస్తున్నారట. దేవిశ్రీని వెనక్కు నెట్టి థమన్ రేసులో దూసుకు వచ్చాడు. ఆయన చేతిలో బడా బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఇంత బిజీ షెడ్యూల్ పెట్టుకొని ఆయన సీసీఎల్ కోసం టైం కేటాయించారు. ఇటీవలే ఈ లీగ్ ముగిసింది. తెలుగు వారియర్స్ కప్ కొట్టారు. ఇక థమన్ మీద మహేష్ తీవ్ర ఆవేశంతో ఉన్నారట. త్రివిక్రమ్ సహకరిస్తే ప్రాజెక్ట్ నుండి తీసేసే అవకాశం కలదంటున్నారు. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కాగా తాజాగా విడుదల చేసిన ఎస్ఎస్ఎంబి 28 ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.