Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాతో పాటు మరో షూట్ లో మహేష్… కిక్ ఇచ్చేలా లుక్, ఇంతకీ మేటర్ ఏంటి?

Mahesh Babu: మహేష్ బాబు 28వ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. లాంగ్ షెడ్యూల్స్ తో చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేశారు. సమ్మర్ ఎండింగ్ కి దాదాపు షూటింగ్ పార్టీ కంప్లీట్ చేయనున్నారట. హైదరాబాద్ లో భారీ లగ్జరీ హౌస్ సెట్ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం.ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర సెట్స్ నుండి కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. […]

  • Written By: SRK
  • Published On:
Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాతో పాటు మరో షూట్ లో మహేష్… కిక్ ఇచ్చేలా లుక్, ఇంతకీ మేటర్ ఏంటి?

Mahesh Babu: మహేష్ బాబు 28వ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. లాంగ్ షెడ్యూల్స్ తో చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేశారు. సమ్మర్ ఎండింగ్ కి దాదాపు షూటింగ్ పార్టీ కంప్లీట్ చేయనున్నారట. హైదరాబాద్ లో భారీ లగ్జరీ హౌస్ సెట్ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం.ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర సెట్స్ నుండి కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. మలయాళ నటుడు జయరామ్ ఓ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో మూవీలో జయరామ్ హేర్ ఫాదర్ రోల్ చేశారు.

Also Read: Taraka Ratna: తారకరత్న ఏకంగా సీఎం భార్యతో రొమాన్స్ చేశాడా? బయటకొచ్చిన షాకింగ్ మేటర్!

త్రివిక్రమ్ మార్క్ పక్కా ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారట. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఎస్ఎస్ఎంబి 28 షూట్ కోసం మహేష్ ఫ్యామిలీ ట్రిప్ సైతం మిస్ అయ్యారు. నమ్రత ఇద్దరు పిల్లలతో పాటు విదేశాలకు వెళ్లారు. సాధారణంగా ఎక్కడికెళ్లినా నలుగురు కలిసి వెళతారు. ఈ ట్రిప్ లో మహేష్ జాయిన్ కాలేదు.

త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కోసమే ఆయన ఆగిపోయారని అంటున్నారు.దర్శకుడు త్రివిక్రమ్ ఆగస్టులో లేదా దసరా కానుకగా మహేష్ మూవీ థియేటర్స్ లోకి తేవాలనే ప్రణాళికలు వేస్తున్నారట. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే ఈ కథలో యాక్షన్ పాళ్లు కూడా తక్కువే అంటున్నారు. కేవలం మూడు ఫైట్స్ ఉంటాయట.

Mahesh Babu

Mahesh Babu

ఇదిలా ఉంటే మహేష్ మరో షూట్లో జాయిన్ అయ్యారు. అయితే అది సినిమా కాదులెండి. మహేష్ ఒక యాడ్ షూట్లో పాల్గొన్నట్లు సమాచారం. ఆ వర్కింగ్ స్టిల్స్, వీడియోలు మహేష్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోలకు మహేష్ .. నా బెస్టీతో మరో ఆహ్లాదకర షూట్, అని కామెంట్ పెట్టాడు. మహేష్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ మారింది. నీలి రంగు సూట్లో మహేష్ అద్భుతంగా ఉన్నాడు. కాగా నెక్స్ట్ ఆయన దర్శకుడు రాజమౌళితో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్లని ప్రచారం జరుగుతుంది.

Also Read:US war on Iraq : ఒకనాడు అమెరికా, నేడు ఇరాన్ వలన అస్తిత్వం ప్రమాదంలో ఇరాక్

సంబంధిత వార్తలు