Businessman Movie Re Release: రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బాబు ‘బిజినెస్ మాన్ ‘ చిత్రం..కనీసం ఇదైనా ‘ఖుషి’ ని కొడుతుందా?
ఆ తర్వాత విడుదలైన ఒక్కడు, సింహాద్రి , దేశముదురు మరియు బిల్లా సినిమాలు పర్వాలేదు అనే రేంజ్ లో ఆడాయి. ఇలా విడుదలైన అన్నీ సినిమాలలో పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం ఆల్ టైం రికార్డు గా నిల్చింది. ఆ తర్వాత టాప్ 2 స్థానం లో ఎన్టీఆర్ సింహాద్రి నిల్చింది. భారీ ప్రొమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు , 1200 షోస్ తో విడుదలైనప్పటికీ కూడా సింహాద్రి చిత్రం పవన్ కళ్యాణ్ ఖుషి కి దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోయింది.

Businessman Movie Re Release: ఈమధ్య స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చెయ్యడం అనేది సరికొత్త ట్రెండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, కొన్ని సినిమాలు అనుకున్న స్థాయికి రీచ్ కాలేకపోయాయి.ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఖుషి మరియు జల్సా, మహేష్ బాబు పోకిరి , రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలు రీ రిలీజ్ లో సంచలనం సృష్టించాయి.
ఆ తర్వాత విడుదలైన ఒక్కడు, సింహాద్రి , దేశముదురు మరియు బిల్లా సినిమాలు పర్వాలేదు అనే రేంజ్ లో ఆడాయి. ఇలా విడుదలైన అన్నీ సినిమాలలో పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం ఆల్ టైం రికార్డు గా నిల్చింది. ఆ తర్వాత టాప్ 2 స్థానం లో ఎన్టీఆర్ సింహాద్రి నిల్చింది. భారీ ప్రొమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు , 1200 షోస్ తో విడుదలైనప్పటికీ కూడా సింహాద్రి చిత్రం పవన్ కళ్యాణ్ ఖుషి కి దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోయింది.
ఇప్పుడు ఖుషి రికార్డు ని కొట్టేది మేమే అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సవాళ్లు విసురుతున్నారు. మహేష్ బాబు పుట్టిన రోజున ముందుగా అతడు సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ మళ్ళీ నిర్ణయం మార్చుకొని మహేష్ కెరీర్ లో పోకిరి తర్వాత అంత ఊర మాస్ సినిమాగా నిల్చిన బిజినెస్ మాన్ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా అంటే కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. అందుకే ఈ చిత్రం కచ్చితంగా ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మహేష్ ఫ్యాన్స్. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒకవేళ బిజినెస్ మాన్ రికార్డు పెడితే సెప్టెంబర్ 2వ తారీఖున గుడుంబా శంకర్ తో బ్రేక్ చేస్తాము అంటూ సవాళ్లు విసురుతున్నారు.