AMB Cinemas: పక్కా బిజినెస్ మాన్…. బెంగుళూరు దుకాణం తెరిచినా మహేష్ బాబు!

తాజాగా మహేష్ బాబు కర్ణాటక రాజధాని బెంగళూరు లో కూడా AMB ని ప్రారంభించబోతున్నారు. అక్కడ ఫేమస్ థియేటర్ అయిన “కపాలి” స్థానంలో భారీ స్థాయిలో AMB ని స్థాపిస్తున్నాడు.

  • Written By: Shiva
  • Published On:
AMB Cinemas: పక్కా బిజినెస్ మాన్…. బెంగుళూరు దుకాణం తెరిచినా మహేష్ బాబు!

AMB Cinemas: సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క తన బిజినెస్ ని విస్తరించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సినిమా హాల్స్ , మినర్వా తో కలిసి చైన్ హోటల్ బిజినెస్ లు చేస్తున్నారు మహేష్. హైదరాబాద్ లో గచ్చిబౌలి లో ఉన్న AMB మాల్ ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కప్పుడు ప్రసాద్ ఐమాక్స్ కు ఉన్న క్రేజ్, బిజినెస్ ఇప్పుడు AMB మాల్ కి వచ్చింది.

తాజాగా మహేష్ బాబు కర్ణాటక రాజధాని బెంగళూరు లో కూడా AMB ని ప్రారంభించబోతున్నారు. అక్కడ ఫేమస్ థియేటర్ అయిన “కపాలి” స్థానంలో భారీ స్థాయిలో AMB ని స్థాపిస్తున్నాడు. 1968 లో సుబేదార్ ఛత్రం రోడ్డు లో దాదాపు 44 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కపాలి థియేటర్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అప్పటి ప్రధాని మొర్జాయి దేశాయ్ దీనిని ప్రారంభించారు.

1465 సీట్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ థియోటర్ ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా దీనిని డెవలప్ చేయడం కుదరలేదు. పైగా 5 దశాబ్దాల నిర్మాణం కావడంతో దానిని రీ మోడలింగ్ చేయడానికి వీలు లేకుండా పోయింది. దాని యజమానులు దాసప్ప సోదరులు 4 ఏళ్ల క్రితం థియేటర్ స్థలాన్ని బెల్గామ్ వ్యాపారికి అమ్మేశారు. చివరికి నిర్మాత జయన్న కపాలి థియోటర్ ను 5 ఏళ్లకు లీజుకు తీసుకున్నాడు. లీజు టైము అయిపోవడంతో దానిని అమ్మేశారు.

దీనితో అక్కడ ఐదు అంతస్తుల భారీ మాల్ ను నిర్మిస్తున్నారు. ఇందులో అధునాతన సాంకేతిక తో AMB మల్టిఫ్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. కన్నడ సినీ ప్రేమికులకు “కపాలి” ఒక ఎమోషన్ అనే చెప్పాలి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య , సుదర్శన్ లకు మించిన హిస్టరీ కపాలి థియేటర్ కు ఉందని చెప్పాలి. అసలు కటౌట్ కట్టడం అనేది కూడా ఈ హాల్ నుంచి మొదలైంది. శివన్న – ఉపేంద్ర నటించిన ‘ఓం ‘ సినిమాను 30 సార్లు విడుదల చేయడం విశేషం. ఇలాంటి హిస్టరీ ఉన్న కపాలి స్థానంలో మహేష్ బాబు AMB రావడం విశేషం .

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు