‘మరక్కార్’ ట్రైలర్‌పై సూపర్ స్టార్ ట్వీట్

  • Written By:
  • Updated On - March 7, 2020 / 12:38 PM IST

16వ శతాబ్దం నాటి కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘మరక్కార్’ మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ ను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుంది. ట్రెండింగ్లోకి దూసుకెళ్తున్న ఈ ట్రైలర్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విటర్లో అభినందలు తెలిపారు.

‘మరక్కార్’ మూవీకి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 16వ శతాబ్దం నాటి చరిత్రను ఈ మూవీలో అద్భుతంగా చూపించబోతున్నారు. కుంజాలి మరక్కార్ అనే నావికుడి పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నారు. మోహన్ లాల్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్, అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 3నిమిషాల నిడివి ఉన్న ‘మరక్కార్’ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మోహన్ లాల్, కీర్తీ సురేష్ నటన ఈ మూవీకి హైలెట్ గా నిలువనుంది.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ విడుదల చేసిన ‘మరక్కార్’ మూవీ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ‘కలలు నిజమయ్యాయి.. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరక్కార్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ సూపర్ స్టార్ ట్వీట్ చేశాడు. నటుడు మోహన్ లాల్, కెమెరామెన్ తిరుతోపాటు యూనిట్ సభ్యులకు గుడ్‌లక్ అంటూ కామెంట్ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మరక్కార్’ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.