చిరు-152లో మహేష్ రోల్ ఇదే?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ 152వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ ఎండోమ్మెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరో పాత్ర ప్లాష్ బ్యాక్ వచ్చే యంగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా చిరు-152లో నటించేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ రాంచరణ్ కోసం రాసుకున్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించనున్నాడు. సీని ఇండస్ట్రీలో మెగాస్టార్ అందరితో సాన్నిహిత్యంగా […]

  • Written By: Neelambaram
  • Published On:
చిరు-152లో మహేష్ రోల్ ఇదే?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ 152వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ ఎండోమ్మెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరో పాత్ర ప్లాష్ బ్యాక్ వచ్చే యంగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా చిరు-152లో నటించేందుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ రాంచరణ్ కోసం రాసుకున్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించనున్నాడు.

సీని ఇండస్ట్రీలో మెగాస్టార్ అందరితో సాన్నిహిత్యంగా ఉంటారు. మొదటి నుంచి మహేష్ బాబు, మెగాస్టార్ కుటుంబాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ చనువుతోనే మెగాస్టార్ మూవీలో మహేష్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్లో బీజీగా ఉండటంతో చిరు-152 నుంచి తప్పుకున్నట్లు తెల్సిందే. రాంచరణ్ కోసం దర్శకుడు కొరటాల శివ ఓ పవర్ క్యారెక్టర్ సిద్ధం చేశాడు. రాంచరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరిగింది. రాంచరణ్ ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో మహేష్ బాబు నక్సలైట్ పాత్ర చేస్తారని అనుకున్నారంత. అయితే కొరటాల మహేష్ బాబును నక్సలైట్ పాత్రలో కాకుండా స్టూడెంట్ లీడర్ గా చూపించనున్నారని ప్రచారం జరుగుతుంది.

గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో మల్టిస్టారర్ మూవీలకు బాగా ఆదరణ లభిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కూడా మల్టిస్టారర్ మూవీగానే తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తుంది. చిరు-152వ మూవీలో మెగాస్టార్, సూపర్ స్టార్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు దాదాపు 20నిమిషాలపాటు కనిపించనున్నాడు. చిరు-152వ రాంచరణ్ మ్యాట్నీ మూవీ మేకర్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మణిశర్మ ఈ మూవీకోసం అదిరిపోయే బాణీలను సమకురుస్తున్నాడు.

సంబంధిత వార్తలు