Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు ఇన్ని సినిమాలను వదులుకున్నారా?
చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు మిల్క్ స్టార్. ఈయన బాల్యంలోనే పది సినిమాలకంటే ఎక్కువ సినిమాల్లో నటించారు.

Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు సినిమా అంటే ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో.. ఆయనతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తారు. ఇప్పటికే ఈయన చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని డిజాస్టర్ ఫలితాలను అందిస్తే.. ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచిపోయాయి. ఇన్ని సినిమాలు చేసినా కూడా మధ్యలో కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావంతో.. మరికొన్ని డేట్స్ సమస్యతో.. ఇంకొన్ని కథ నచ్చక వదిలేసాడు మహేష్ బాబు. అలా కాదనుకున్న సినిమాలు దాదాపు 15 వరకు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.
యమలీల: చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు మిల్క్ స్టార్. ఈయన బాల్యంలోనే పది సినిమాలకంటే ఎక్కువ సినిమాల్లో నటించారు. అయితే మహేష్ బాల్యంలోనే ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమా కథ చెప్పారట. కానీ సూపర్ స్టార్ కృష్ణ చదువుపేరు చెప్పి అవకాశాన్ని మిస్ చేశారట. ఇక ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు.
ఏమాయ చేసావే.. ఏమాయ చేశావే సినిమా కోసం గౌతమ్ మీనన్ ముందుగా మహేష్ బాబునే ఎంచుకున్నారట. కానీ కనీసం కథ కూడా వినలేదట మహేష్. అయినా ఈ సినిమా సమంత, నాగచైతన్యకు రాసి పెట్టి ఉంటే మహేష్ ఎలా చేస్తారు లెండి అని కొందరు ఫన్నీగా స్పందిస్తుంటారు. ఈ సినిమాతోనే సమంత, చైతూ స్నేహితులుగా ఆ తర్వాత ప్రేమికులుగా ఆ తర్వాత భార్యభర్తలుగా మారారు. కానీ ఇప్పుడు విడాకులు తీసుకున్నారు.
మనసంతా నువ్వే: మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కుమార్ కంటే ముందు మహేష్ నే కలిసారట ఎమ్మెస్ రాజు. కానీ ఏమైందో ఏమో గానీ ఇందులో ఉదయ్ కనిపించారు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.
లీడర్: రానా దగ్గుబాటి హీరోగా పరిచయమైన లీడర్ సినిమాలో కూడా ముందుగా మహేష్ నే అనుకున్నారట. కానీ కమర్షియల్ యాంగిల్ కావాలని అనడంతో శేఖర్ కమ్ములా ఇందులో రానాను తీసుకున్నారు అని టాక్ వచ్చింది.
నువ్వే కావాలి: రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ఈయన నటనను మెచ్చి నువ్వే కావాలి సినిమా కోసం ఆయననే సంప్రదించారట. కానీ మహేష్ దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఆ సినిమా తరుణ్ వరకు వెళ్లింది. ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన తరుణ్ ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫిదా: శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించిన ఫిదా సినిమాలో కూడా మహేష్ బాబునే హీరోగా కావాలనుకున్నాడట డైరెక్టర్. అయితే ఇందులో హీరోయిన్ డామినేషన్ రోల్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మహేష్ ఈ సినిమాను వదులుకున్నారు అని టాక్. ఇక మహేష్ రిజక్ట్ చేసిన ఈ సినిమా వరుణ్ తేజ్ వరకు వెళ్లింది. కానీ ఎవరు అనుకోని విధంగా సూపర్ హిట్ సక్సెస్ ను సొంతం చేసుకొని.. హీరోహీరోయిన్ లను స్టార్లుగా నిలబెట్టింది ఈ సినిమా.
పుష్ప: అల్లు అర్జున్ ను పాన్ ఇండయా స్టార్ గా నిలబెట్టిన పుష్ప సినిమా ఆఫర్ కూడా ముందుగా మహేష్ బాబు వద్దకే వెళ్లింది. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా కోసం ముందుగా మహేష్ నే సంప్రదించారట. ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించిన తర్వాత తప్పుకున్నాడు మిల్క్ స్టార్. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తే.. అటు దర్శకుడికి, ఇటు బన్నీకి మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమా సీక్వెల్ కూడా సిద్దమవుతుంది. అంతేకాదు ఇందులో నటించిన బన్నీకి ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.
ఈ సినిమాలు మాత్రమే కాదు.. ఇడియట్, గజినీ, రుద్రమదేవి, 24, గ్యాంగ్ లీడర్, స్నేహితుడు, మణిరత్నం, జనగణమన సినినమా ఆఫర్లు కూడా మహేష్ బాబు వరకు వెళ్లాయి. కానీ ఈ సినిమాలను కూడా రిజక్ట్ చేశాడు. ఇందులో హిట్ అయినా సినిమాలు ఉండడతో ఆయన అభిమానులు తెగ ఫీల్ అయిపోతుంటారు. ఇంతకీ జనగణమన సినిమా ఏంటి అనుకుంటున్నారా? పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా మహేష్ బాబు మిస్ అవుతున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండతో లైగర్ మూవీ చేస్తూనే.. అతనితోనే ‘జనగణమన’ సినిమాను అనౌన్స్ చేశాడు. మన దేశంలో మిలటరీ రూల్ వస్తే ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. ఇప్పటికీ వర్కౌట్ కాలేదు. మరి ఇన్ని సినిమాలను వదులుకున్నా కూడా మహేష్ క్రెడిట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయన నటిస్తున్న అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ లనే సొంతం చేసుకున్నాయి.
