Mahesh Babu- Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ తో మహేష్ బాబు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు
సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని, దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నాడని టాక్.ఇదే కనుక నిజమైతే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలవుతాయని, సౌత్ ఇండియా లో అయితే ఇప్పట్లో ఏ స్టార్ కూడా అందుకోలేని రేంజ్ కలెక్షన్స్ ని వసూలు చేస్తుందని అంటున్నారు.

Mahesh Babu- Rajinikanth: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రస్తుతం మల్టీస్టార్రర్ సినిమాల జోరు ఒక రేంజ్ లో కొనసాగుతుంది.దర్శక నిర్మాతలు కూడా మల్టీస్టార్రర్ చిత్రాలను తెరకెక్కించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వేరు వేరు భాషల్లో సూపర్ స్టార్స్ ని ఎంచుకొని సినిమాలు చెయ్యడం పైనే శ్రద్ద పెడుతున్నారు. రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ‘వార్ 2 ‘ చిత్రం సెట్ అయ్యింది.
ఇంకా అధికారిక ప్రకటన కూడా రాలేదు కానీ, ఒక్కసారి అధికారిక ప్రకటన వస్తే సోషల్ మీడియా షేక్ అవుతుందనే చెప్పాలి. అయితే రీసెంట్ గా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ మరొకటి సెట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. అతి త్వరలోనే సౌత్ ఇండియా లో సూపర్ స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ మరియు మహేష్ బాబు కలయిక లో ఒక ప్రాజెక్ట్ రాబోతుందని తెలుస్తుంది.
సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని, దిల్ రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నాడని టాక్.ఇదే కనుక నిజమైతే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలవుతాయని, సౌత్ ఇండియా లో అయితే ఇప్పట్లో ఏ స్టార్ కూడా అందుకోలేని రేంజ్ కలెక్షన్స్ ని వసూలు చేస్తుందని అంటున్నారు.
శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ మరియు కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2 ‘ వంటి చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తి అయ్యాక ఆయన హిందీ రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ చేస్తాడు. మరో పక్క మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు, రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయనున్నాడు.ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి అయ్యాకే మహేష్ – రజిని కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్లనుంది.