Sukumar: ఆ విషయం లో సుకుమార్ ని టార్చర్ పెడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్…

ఈ సినిమాతో కుమార్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇక ఇప్పటివరకు సుకుమార్ ఆయన కెరియర్ లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలకు మంచి హిట్ ఇస్తే మహేష్ బాబు కి మాత్రం వన్ లాంటి ప్లాప్ సినిమా ఇచ్చాడు.

  • Written By: Gopi
  • Published On:
Sukumar: ఆ విషయం లో సుకుమార్ ని టార్చర్ పెడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్…

Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ఇంటలిజెంట్ డైరెక్టర్ ఎవరు అంటే సుకుమార్ అనే చెప్పాలి. ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ఇండేప్త్ సీన్లని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అది సినిమా చూస్తే అర్థమవదు ఆ సినిమాని ఒకటికి రెండుసార్లు చూసి మనం అబ్జర్వ్ చేస్తే తప్ప ఆ సినిమా లో ఆ సీన్ అలా ఎందుకు పెట్టాడు అనేది మనకు అర్థం కాదు. ఇక ఆయన చేసిన వన్ సినిమా హిట్ అవ్వకపోయిన విమర్శకుల ప్రశంశలు దక్కించుకుంది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమా మాత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ఆయన ప్రతి దానికి కూడా లాజిక్కులు వాడుతూ ఎన్టీఆర్ ని ఒక హెవీ టాలెంటెడ్ ఉన్నహీరో గా చూపించాడు. ఈ సినిమా తీసినందుకు మనం సుకుమార్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో హీరో విలన్ ఇద్దరు కూడా మంచి తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్య నడిచే ఒక మైండ్ గేమ్ లో ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా ప్రేక్షకులని ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేయడానికి స్క్రీన్ ప్లే ని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు సుకుమార్…

ఈ సినిమాతో కుమార్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇక ఇప్పటివరకు సుకుమార్ ఆయన కెరియర్ లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలకు మంచి హిట్ ఇస్తే మహేష్ బాబు కి మాత్రం వన్ లాంటి ప్లాప్ సినిమా ఇచ్చాడు. అయితే మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో తొందరలోనే మరో సినిమా ఉండబోతుందనే విషయం తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు ఈ సినిమా పూర్తయితే రాజమౌళి సినిమా మీదికి వెళ్తాడు. దాని తర్వాత ఉంటే సుకుమార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఉండవచ్చు అని అటు సుకుమార్ ఫ్యాన్స్, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…అయితే కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇప్పటికే సుకుమార్ కి పర్సనల్ గా కాల్ చేసి, మెసేజ్ లు చేసి ఎప్పుడు మహేష్ బాబు కి హిట్ ఇస్తారు సార్ అంటూ సుకుమార్ ని టార్చర్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు