Mahesh Babu: గద్దలతో ఆట.. గన్ తో వేట.. మహేష్ ఫ్యామిలీ వీడియో వైరల్!
మహేష్ ఫ్యామిలీ స్కాట్లాండ్‌లోని అతి పురాతనమైన రాయల్ స్కాట్స్ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించి అక్కడ సరదాగా ఫొటోస్ దిగారు.

Mahesh Babu: వీలు దొరికితే ఫార్ వెళ్లే టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యామిలీ.. నెల క్రితం కూడా వెకేషన్ కోసం యూరప్ వెళ్లింది. లండన్‌లో కొన్ని రోజులు గడిపారు. తర్వాత స్కాట్లాండ్ వెళ్లి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. మహేశ్ భార్య నమ్రత ఎప్పటికప్పుడు తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తాజాగా మహేశ్ కూతురు తమ టూర్‌కు సంబంధించిన ఓ రీల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్ చేసింది.
లండన్‌లో పుట్టిన రోజు..
మహేశ్‌బాబు ఆగస్టు 9న మహేష్ పుటిన రోజుని ఫ్యామిలీతో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అక్కడ వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో.. సితార, గౌతమ్‌లు ఎలా సరదాగా గడుపుతున్నారో అనేది నమ్రత ఎప్పటికప్పుడు ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పురాతన మ్యూజియం సందర్శన..
మహేష్ ఫ్యామిలీ స్కాట్లాండ్‌లోని అతి పురాతనమైన రాయల్ స్కాట్స్ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించి అక్కడ సరదాగా ఫొటోస్ దిగారు. సితార, మహేష్, గౌతమ్, నమ్రతలు సెల్ఫీలకు, ఫొటోలకి ఫోజులిచ్చారు.
తాజాగా వీడియో రీల్..
తాజాగా సితారా రిలీజ్ చేసిన వీడియోలో స్కాట్‌లాండ్‌లోని అడ్వెంచర్‌లో మహేశ్‌బాబు, గౌతమ్, నమ్రత, సితారా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. మహేశ్, గౌతమ్, సితార గన్ పట్టి షూటింగ్ చేశారు. గోల్ప్ ఆడారు. సితార గోల్ఫ్ ఆడుతున్న దృశ్యం వీడియోలో ఉంది. ఇక చివరకు ఈగల్స్‌తో ఆటలు.. ఈ వీడియోలో చివరన అడ్వెంచర్‌లో ఈగల్స్(గద్దలతో) సితార, నమ్రత ఆటలాడారు. గద్దలను పిలవడం, వాటికి ఆహారం పెట్టడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.
