మెగాస్టార్ మూవీలో సూపర్ స్టార్?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిరంజీవి 152వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘గోవింద ఆచార్య’, లేదా ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి-మహేష్ బాబుల మధ్య ఎంతో సన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ‘భరత్ అనే […]

  • Written By: Neelambaram
  • Published On:
మెగాస్టార్ మూవీలో సూపర్ స్టార్?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిరంజీవి 152వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘గోవింద ఆచార్య’, లేదా ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి-మహేష్ బాబుల మధ్య ఎంతో సన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ‘భరత్ అనే నేను’లో నటించి బాక్సాఫీస్ అందుకున్నాడు. దీంతో ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని దర్శకుడు కోరగా మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి-మహేష్ బాబు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.

చిరంజీవి-152 మూవీలో మెగాస్టార్ డ్యూయల్ రోల్స్ చేయనున్నారు. పవర్ ఫుల్ ఎండోన్మెంట్ అధికారిగా కనిపించబోతున్నాడు. అదేవిధంగా ప్లాష్ బ్యాక్లో యంగ్ చిరంజీవి కనిపించనున్నారు. ఈ మూవీలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ నక్సలైట్ పాత్రలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ బీజీగా ఉండటం వల్ల రాంచరణ్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ చేయాల్సిన క్యారక్టర్లో అల్లు అర్జున్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ మూవీలో మహేష్ గెస్ట్ అప్పిరెన్స్ కనిపిస్తారని ప్రచారం జరుగుతుండటంతో మెగా ఫ్యాన్స్ తోపాటు మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మూవీలో చిరంజీవికి జోడి త్రిష నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చిన ‘స్టాలీన్’ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. చిరంజీవి-152లో రెజీనా ఓ స్పెషల్ సాంగ్లో నటిస్తుంది. అలాగే తెలుగమ్మాయి ఈషారెబ్బా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీని రాంచరణ్ కొణిదల ప్రొడక్షన్లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత చిరంజీవి మూవీకి మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నారు. మెగాస్టార్ కు తోడుగా సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్లోని బిగ్ స్టార్లను ఒక్క టిక్కెట్ పైనే చూడనుండటంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సంబంధిత వార్తలు