Actress Mahalakshmi: భర్త రవీంద్రకు ఊహించిన గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మి.. తెలిస్తే షాక్ అవుతారు..

భారీ కాయంతో ఉన్న రవీంద్రను అందంగా ఉన్న మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి? అంటూ ప్రశ్నలు వేసి.. డబ్బు కోసమేనని కొందరు పోస్టుులు పెడుతూ వస్తున్నారు. అయితే అవేమీ పట్టించుకోకుండా రవీంద్ర, మహాలక్ష్మిలు మాత్రం తాము అన్యోన్యంగా ఉంటున్నామని చెబుతున్నారు. తాజాగా రవీంద్ర కోసం మహాలక్ష్మి ఊహించని గిప్ట్ ఇచ్చింది. అదేంటో తెలిస్తే షాకవుతారు. ఇంతకీ తన భర్తకు ఇచ్చిన గిఫ్ట్ ఎంటో తెలుసుకుందామా..

  • Written By: Chai Muchhata
  • Published On:
Actress Mahalakshmi: భర్త రవీంద్రకు ఊహించిన గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మి.. తెలిస్తే షాక్ అవుతారు..

Actress Mahalakshmi: సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో చాలా మంది తోటి నటులనే పెళ్లి చేసుకున్నవారున్నారు. కుదరకపోతే డైరెక్టర్, టెక్నీషియన్ ఇలా ఎవరైనా తమతో కలిసి పనిచేసిన వారితో సాన్నిహిత్యంగా ఉండి వారితో జీవితాన్ని పంచుకుంటున్నారు. బుల్లితెరపై ఫేమస్ నటిగా పేరు తెచ్చుకున్న మహాలక్ష్మి నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి జోడిలో తేడాలున్నా ప్రేమతో ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే సోషల్ మీడియా వేదికపై వీరిపై రకరకాల ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు.

భారీ కాయంతో ఉన్న రవీంద్రను అందంగా ఉన్న మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి? అంటూ ప్రశ్నలు వేసి.. డబ్బు కోసమేనని కొందరు పోస్టుులు పెడుతూ వస్తున్నారు. అయితే అవేమీ పట్టించుకోకుండా రవీంద్ర, మహాలక్ష్మిలు మాత్రం తాము అన్యోన్యంగా ఉంటున్నామని చెబుతున్నారు. తాజాగా రవీంద్ర కోసం మహాలక్ష్మి ఊహించని గిప్ట్ ఇచ్చింది. అదేంటో తెలిస్తే షాకవుతారు. ఇంతకీ తన భర్తకు ఇచ్చిన గిఫ్ట్ ఎంటో తెలుసుకుందామా..

రవీంద్ర చంద్రశేఖరన్, మహాలక్ష్మిలకు రెండు సంవత్సరాల కిందన పెళ్లయింది. తాను ఎంతో ఇష్టపడి రవీంద్రను పెళ్లి చేసుకున్నానని మహాలక్ష్మి చెబుతూ వస్తోంది. అయితే వీరు తమ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేస్తూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుడా మా మధ్య లవ్ ఉందంటూ.. అన్యోన్యంగా ఉండే ఫొటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా రవీంద్ర బర్త్ డే సందర్భంగా మహాలక్ష్మి తనకు ఊహించిన గిఫ్ట్ ఇచ్చిందట.

రవీంద్రకు సంబంధించిన పెయింట్ ను ఆయన ఎత్తు ఉండేలా చేయించిందట. ఆరు అడుగులు ఉన్న ఈ పెయింట్ ను తానే తీర్చి దిద్ది రవీంద్రకు గిఫ్ట్ గా ఇచ్చిందట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నా లైఫ్ లో ధైర్యం పోసి.. మళ్లీ జీవితాన్ని ఇచ్చిన మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో మెసేజ్ పెట్టింది. అంతేకాకుండా మీరే నా బలం.. అందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అరి రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు