Rajamouli On Mahabharatham: పది భాగాలుగా మహాభారతం… డ్రీం ప్రాజెక్ట్ పై రాజమౌళి సంచలన ప్రకటన, హీరో ఎవరంటే?
మహాభారతం భారీ సబ్జెక్టు పది భాగాలుగా తెరకెక్కించవచ్చు. అన్ని అలరించే ఘట్టాలు అందులో ఉన్నాయి. ఒక సిరీస్ మాదిరి పలు చిత్రాలు తీయవచ్చని రాజమౌళి అన్నారు. రాజమౌళి మాటలు పరిశీలిస్తే.

Rajamouli On Mahabharatham: దర్శకుడు రాజమౌళి చాలా కాలంగా తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం అని చెబుతున్నారు. మహాభారతాన్ని సినిమా తీయడమే నా కల. అయితే ఆ ప్రాజెక్ట్ చేసేంత అనుభవం నాకు ఇంకా రాలేదు. మరింత పరిణితి, నైపుణ్యం సాధించాక మహాభారతం తీస్తానని ఆయన పలుమార్లు వెల్లడించారు. తాజాగా మరోసారి ఆయన మహాభారతం ప్రాజెక్ట్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. రాజమౌళి మాట్లాడుతూ… భారత దేశంలో అందుబాటులో ఉన్న మహాభారతానికి సంబంధించిన అన్ని వెర్షన్స్ అధ్యయనం చేయాలి. దానికే ఓ ఏడాది సమయం పడుతుంది.
మహాభారతం భారీ సబ్జెక్టు పది భాగాలుగా తెరకెక్కించవచ్చు. అన్ని అలరించే ఘట్టాలు అందులో ఉన్నాయి. ఒక సిరీస్ మాదిరి పలు చిత్రాలు తీయవచ్చని రాజమౌళి అన్నారు. రాజమౌళి మాటలు పరిశీలిస్తే… ఒకవేళ ఆయన మహాభారతం మొదలుపెడితే ఏళ్ల తరబడి దాన్నే తెరకెక్కిస్తారు అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి పదేళ్లకు పైగా కేటాయించే ఆస్కారం కలదు. జేమ్స్ కామెరాన్ టెర్మినేటర్, అవతార్ వంటి సిరీస్ల కోసం దశాబ్దాల సమయం కేటాయించారు.
మహాభారతాన్ని రాజమౌళి అదే స్థాయిలో తెరకెక్కించే అవకాశం కలదు. మరి మహాభారతంలో హీరో ఎవరు అంటే రాజమౌళి దగ్గర స్పష్టమైన ఆన్సర్ లేదు. అలాగే ఈ ప్రాజెక్ట్ లో ఒకే హీరో ఉండడు. ఒక్కో భాగంలో ఒక్కో నటుడు హైలెట్ అయ్యే అవకాశం కలదు. మహాభారతంలో శ్రీకృష్ణ, అర్జున, భీముడు, కర్ణుడు, అభిమన్యుడు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు వంటి పాత్రలకు హీరో ఫీచర్స్ ఉంటాయి.
కాబట్టి ఏ ఒక్కరూ మెయిన్ హీరోగా ఉండే అవకాశం లేదు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ఇంకా సమయం కావాలి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో మూవీ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలో పట్టాలెక్కనుంది. మహేష్ బాబుతో రాజమౌళి మొదటిసారి మూవీ చేస్తున్నారు. జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని ఇప్పటికే చెప్పారు. ఈ చిత్ర బడ్జెట్ రూ. 800 నుండి 1000 కోట్లు అంటున్నారు. హాలీవుడ్ చిత్రాలను తలదన్నే స్థాయిలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
