‘మగువ’లకు స్పెషల్ గిప్ట్ రెడీ చేసిన ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్టు లుక్ ఇటీవల విడుదలైన సంగతి తెల్సిందే. కొన్నేళ్లుగా పవర్ స్టార్ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ‘వకీల్ సాబ్’ పోస్టర్ రిలీజ్ కాగానే అభిమానులు లైక్ లు, షేర్లలో సోషల్ మీడియాను హడలెత్తించారు. దీంతో ‘వకీల్ సాబ్’ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది. ‘వకీల్ సాబ్’ మూవీ శరవేగంగా పూర్తి చేసుకుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ పై […]

  • Written By: Neelambaram
  • Published On:
‘మగువ’లకు స్పెషల్ గిప్ట్ రెడీ చేసిన ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్టు లుక్ ఇటీవల విడుదలైన సంగతి తెల్సిందే. కొన్నేళ్లుగా పవర్ స్టార్ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ‘వకీల్ సాబ్’ పోస్టర్ రిలీజ్ కాగానే అభిమానులు లైక్ లు, షేర్లలో సోషల్ మీడియాను హడలెత్తించారు. దీంతో ‘వకీల్ సాబ్’ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది.

‘వకీల్ సాబ్’ మూవీ శరవేగంగా పూర్తి చేసుకుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ పై దృష్టిసారించింది. ఇప్పటికే టైటిల్ లాంచ్, ఫస్టు లుక్ తో చిత్రబృందం ఆకట్టుకుంది. మార్చి 8న జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఆకట్టుకునేలా ఒక స్పెషల్ సాంగ్ ను చిత్రబృందం రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ సాంగ్ టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు. 29సెకన్ల నిడివిగల ఈ పాట ప్రతీఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.

`మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా!` అంటూ చిన్నపాటి గ్లింప్స్ ని విడుదల చేశారు. పూర్తి సాంగ్ ను మార్చి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించారు. సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. దిల్ రాజు-బోనీకపూర్ నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీకి ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ బాణీలను సమకూరుస్తున్నాడు. పూర్తి సాంగ్ రిలీజైతే మాత్రం యూట్యూబ్లో సరికొత్త రికార్డులు తిరగరాయడం ఖాయంగా కన్పిస్తుంది. వేసవిలో మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు