Maestro Telugu Movie Review: మాస్ట్రో రివ్యూ

Maestro Telugu Movie Review: నటీనటులు: నితిన్‌, తమన్నా, నభా నటేశ్‌, జిషు సేన్‌ గుప్త, నరేశ్‌, శ్రీముఖి తదితరులు; దర్శకత్వం: మేర్లపాక గాంధీ, సంగీతం: మహతి స్వర సాగర్‌, సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖర్‌, నిర్మాత: సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి, నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్‌’కి ఈ సినిమా రీమేక్‌. ఈ చిత్రం ఈ రోజు నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయింది. మరి ప్రేక్షకులను […]

  • Written By: Raghava
  • Published On:
Maestro Telugu Movie Review: మాస్ట్రో రివ్యూ

Maestro Telugu Movie Review:
నటీనటులు: నితిన్‌, తమన్నా, నభా నటేశ్‌, జిషు సేన్‌ గుప్త, నరేశ్‌, శ్రీముఖి తదితరులు;
దర్శకత్వం: మేర్లపాక గాంధీ,
సంగీతం: మహతి స్వర సాగర్‌,
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌,
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖర్‌,
నిర్మాత: సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి,

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్‌’కి ఈ సినిమా రీమేక్‌. ఈ చిత్రం ఈ రోజు నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

కథ :
అరుణ్‌ (నితిన్‌) తన 14 ఏళ్ల వయసులో ఓ ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోతాడు. అయితే, అరుణ్ పియానో చాలా బాగా వాయిస్తాడు. ఈ క్రమంలోనే ఓ పియానో కొందామని వెళ్తే.. అక్కడే సోఫి(నభా నటేశ్‌) పరిచయం అవుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరోపక్క మోహన్‌(నరేశ్‌) వివాహ వార్షికోత్సవం సందర్భంగా పియానో వాయించడానికి అరుణ్ మోహన్ ఇంటికి వెళ్తాడు. కానీ అప్పటికే మోహన్‌ హత్య చేయబడి ఉంటాడు. ఆ హత్య చేసిందెవరు? ఆ హత్యకి మోహన్‌ భార్య సిమ్రన్‌ (తమన్నా)కి సంబంధం ఏమిటి ? అసలు సిమ్రన్‌ కి బాబీ (జిషు సేన్‌ గుప్త)కు ససంబంధం ఏమిటి ? ఈ మధ్యలో అరుణ్‌ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

దర్శకుడు మేర్లపాక గాంధీ ‘అంధాదున్‌’ చిత్రాన్ని తెలుగులో చక్కగా రీమేక్‌ చేశాడు. ఒరిజినల్ సినిమాలోని ఆత్మ ఏ మాత్రం చెడకుండా ‘అంధాదున్‌’ను ‘మాస్ట్రో’గా గొప్పగా మలిచాడు. అంధుడైన అరుణ్‌ పాత్రలో నితిన్ బాగా ఆకట్టుకున్నాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ తో పాటు తన టైమింగ్‌ తో నూ మెప్పించాడు.

ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే మెయిన్ సీక్వెన్స్ లో తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నితిన్ హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక కథానాయికగా నటించిన నభా నటేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన తమన్నా ఎప్పటిలాగే తన అందచందాలతో అలరించింది.

ఇక ‘మాస్ట్రో’ సినిమా మొదటి భాగం ఎంటర్టైన్ గా సాగినా.. సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ స్లో నేరేషన్ తో బోర్ కొడుతుంది. అయితే దర్శకుడు రాసుకున్న కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే ఆ సన్నివేశాల్లో నాటకీయత తగ్గించి ఉంటే బాగుండేది. నాటకీయత కారణంగా కథలో సహజత్వం కొంత వరకు లోపించింది.

ప్లస్ పాయింట్స్ :
నితిన్‌ నటన, తమన్నా గ్లామర్,
ఫస్ట్ హాఫ్,
సంగీతం,
సాంకేతిక విభాగం పనితీరు.

మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ లో వచ్చే స్లో సీన్స్,
రెగ్యులర్ ప్లే,

సినిమా చూడాలా? వద్దా ?

‘మాస్ట్రో’ అంటూ వచ్చిన ఈ సినిమాలో సీరియస్ పాయింట్ అండ్ కామెడీ సీన్స్ మరియు ఎమోషన్స్‌ కు ప్రాధాన్యత ఉన్న కథాంశం బాగున్నాయి. ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతూ విసిగిస్తాయి. ఓవరాల్ గా సినిమా బాగుంది. సినిమాని చూడొచ్చు.

రేటింగ్ : 2.75

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు