Nabha Natesh: ఈ సినిమా నాకు ఫస్ట్ ఎక్స్ పీరియన్స్: నభా నటేష్

Nabha Natesh: ‘నభా నటేష్‌’ (Nabha Natesh) .. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్ తర్వాత ఈ బ్యూటీ రేంజ్ మారిపోతుంది అనుకున్నారు.. నభా స్థాయి మాత్రం రోజురోజుకు పడిపోతూ వచ్చింది. స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే.. చివరకు సాధారణ హీరోయిన్ గా కూడా నిలబడటం కష్టమైపోయింది. చివరకు ఛాన్స్ లు కూడా లేక ఐటమ్ సాంగ్స్ కు సై అంది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో నితిన్‌ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా […]

  • Written By: Raghava
  • Published On:
Nabha Natesh: ఈ సినిమా నాకు ఫస్ట్ ఎక్స్ పీరియన్స్: నభా నటేష్

Nabha NateshNabha Natesh: ‘నభా నటేష్‌’ (Nabha Natesh) .. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్ తర్వాత ఈ బ్యూటీ రేంజ్ మారిపోతుంది అనుకున్నారు.. నభా స్థాయి మాత్రం రోజురోజుకు పడిపోతూ వచ్చింది. స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే.. చివరకు సాధారణ హీరోయిన్ గా కూడా నిలబడటం కష్టమైపోయింది. చివరకు ఛాన్స్ లు కూడా లేక ఐటమ్ సాంగ్స్ కు సై అంది.

అయితే, ఇలాంటి పరిస్థితుల్లో నితిన్‌ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 17న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా రాబోతుంది. అందుకే, నభా నటేష్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. నేను ఇంకా ఫామ్ లోనే ఉన్నాను అని చెప్పడానికి బాగానే కష్టపడుతుంది.

ఇంతకీ నభా మీడియాతో ఏమి ముచ్చటించిందో చూద్దాం.. నభా మాటల్లోనే.. ‘ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ‘అంధధూన్’ హిందీలో మంచి విజయం సాధించింది. అలాంటి సక్సెస్ ఫుల్ రీమేక్‌ లో నేను హీరోయిన్ గా నటించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.

రాధికా ఆప్టే లాంటి మంచి నటి అద్బుతంగా నటించిన పాత్రలో నేను నటించాలి అన్నప్పుడు మొదట నాకు భయమేసింది. కానీ, ఇంత మంచి ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. నా శైలిలో నటించడానికి ప్రయత్నించాను. నితిన్ తో జోడిగా నటించడం బాగుంది. షూటింగ్ సరదాగా సాగింది.”

“కరోనా సమయంలో నేను నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది మూడో సినిమా. ఇక నా కెరీర్ లోనే ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న మొదటి సినిమా.. ఈ ‘మాస్ట్రో’ సినిమా. ఒక విధంగా నాకు ఆ విషయంలో ఈ సినిమా ఫస్ట్ ఎక్స్ పీరియన్స్. అన్నట్టు తెలుగులో నా డబ్బింగ్ నేనే చెప్పాలనుకున్నాను.

కానీ కరోనా కారణంగా కుదరలేదు. భవిష్యత్తులో నా పాత్రలకు కచ్చితంగా నేనే డబ్బింగ్ చెబుతాను అంటూ చేపుకొచ్చింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు