Alto Tour H1: రేటు తక్కువ.. మైలేజీ ఎక్కువ.. మారుతి నుంచి మరో కొత్తకారు.. మిడిల్‌క్లాస్‌కు పండగే!

పెట్రోల్‌ వేరియంట్‌ టూర్‌ హెచ్‌1 మోడల్‌ అయితే లీటరుకు 24.6 కిలోమీటర్ల మైలేజ్‌ అందిస్తుందని కంపెనీ తెలియజేస్తోంది. అదే సీఎన్‌జీ వేరియంట్‌ అయితే కేజీకి 34.46 కిలోమీటర్ల మైలేజ్‌ వస్తుందని పేర్కొంటోంది. ఇంకా ఈ కారులో స్పీడ్‌ లిమిటింగ్‌ సిస్టమ్, ఇంజిన్‌ ఇమ్మొబిలైజర్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్త మోడల్‌ కోసం చూసే వారు దీన్ని కూడా గమనించొచ్చు. తక్కువ ధరలో అదిరే మైలేజ్‌తో ఈ కారు మార్కెట్‌లో లభిస్తోంది. అందువల్ల కొత్త కారు కొనాలని చూస్తే వారు దీన్ని గమనించొచ్చు.

  • Written By: Raj Shekar
  • Published On:
Alto Tour H1: రేటు తక్కువ.. మైలేజీ ఎక్కువ.. మారుతి నుంచి మరో కొత్తకారు.. మిడిల్‌క్లాస్‌కు పండగే!

Alto Tour H1: దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతూ వస్తున్న మారుతీ సుజుకీ ఇండియా మారుతీ సుజుకీ అదరగొట్టేసింది. మరో కొత్త కారును మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. అదిరిపోయే ఫీచర్లు దీని సొంతం. దీని రేటు తక్కువ. మైలేజ్‌ కూడా ఎక్కువ. ఇంకా అదిరే ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో మిడిల్‌క్లాస్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది.

అల్టోటూర్‌ హెచ్‌1 పేరుతో లాంచ్‌..
మారుతీ సుజుకీ ఇండియా తాజాగా అల్టో టూర్‌ హెచ్‌1 పేరుతో కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది. ఇది కమర్షియల్‌ విభాగానికి చెందిన మోడల్‌. బీఎస్‌6 ప్రమాణాలకు అనుగుణంగా దీనిని తయారు చేశారు. ఇందులో ఏబీఎస్, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్లు, డ్రైవర్‌ అండ్‌ కో డ్రైవర్‌ సైడ్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రారంభం ధర రూ.4.8 లక్షలు..
మారుతీ సుజుకీ అల్టో టూర్‌ హెచ్‌1 మోడల్‌ ధర రూ. 4.8 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్‌ ధర. 1 లీటర్‌ 5 ఎంటీ పెట్రోల్‌ మోడల్‌కు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్‌ విషయానికి వస్తే.. దీని ధర రూ. 5.7 లక్షలుగా ఉంది. ఇది కూడా ఎక్స్‌షోరూమ్‌ ధరనే.

మూడు రంగుల్లో..
ఈ కొత్త అల్టో టూర్‌ హెచ్‌1 మోడల్‌ మూడు కలర్‌ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. మెటాలిక్‌ సిల్కీ సిల్వర్, మెటాలిక్‌ గ్రానైట్‌ గ్రే, తెలుపు రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంటుంది. నచ్చిన కలర్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఇందులో కంపెనీకే సిరీస్‌ 1.0 ఎల్‌ డ్యూయెల్‌ జెట్, డ్యూయెల్‌ వీవీటీ ఇంజిన్‌ అమర్చారు. అదిరే పనితీరు, అధిక మైలేజ్‌ ఈ మోడల్‌ సొంతం అని చెప్పుకోవచ్చు.

అధిక మైలేజీ…
పెట్రోల్‌ వేరియంట్‌ టూర్‌ హెచ్‌1 మోడల్‌ అయితే లీటరుకు 24.6 కిలోమీటర్ల మైలేజ్‌ అందిస్తుందని కంపెనీ తెలియజేస్తోంది. అదే సీఎన్‌జీ వేరియంట్‌ అయితే కేజీకి 34.46 కిలోమీటర్ల మైలేజ్‌ వస్తుందని పేర్కొంటోంది. ఇంకా ఈ కారులో స్పీడ్‌ లిమిటింగ్‌ సిస్టమ్, ఇంజిన్‌ ఇమ్మొబిలైజర్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్త మోడల్‌ కోసం చూసే వారు దీన్ని కూడా గమనించొచ్చు. తక్కువ ధరలో అదిరే మైలేజ్‌తో ఈ కారు మార్కెట్‌లో లభిస్తోంది. అందువల్ల కొత్త కారు కొనాలని చూస్తే వారు దీన్ని గమనించొచ్చు.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు