Exter SUV: తక్కువ ధరలో SUV కారు ఇదే.. అదిపోతున్న ఫీచర్స్..
Exter SUV ఎక్స్ షో రూం ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. స్పెషిఫికేషన్, ఫీచర్స్, ధరపై ఇంకా కంపెనీ ఫుల్ డిటేయిల్స్ ఇవ్వలేదు. అయితే ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా పంచ్, మారుతి సుజుకీ ఇగ్నిస్, నిస్సాన్ మోడళ్లకు పోటీనిస్తుందని అంటున్నారు.

Exter SUV: కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. వీరి అవసరాలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లనూ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కేవలం డబ్బు బాగా ఉన్నవారు మాత్రమే కాకుండా సామాన్యులు సైతం కొనుగోలు చేసే విధంగా కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇటీవల SUV వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు సైతం ఇలాంటి కార్లనే మార్కెట్లకి తీసుకొస్తున్నాయి. లేటేస్టుగా హ్యుండాయ్ కంపెనీ నుంచి Exter SUV మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే దీని గురించి ఆన్లైన్లో పెట్టారు. దీని ఫీచర్స్ అద్భుతంగా ఉండడంతో బుక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
SUV అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. దీని ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ SUV ల్లోనూ తక్కువ ధరలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. హ్యుండాయ్ Exter SUV విషయానికొస్తే ఈ కారు అన్ని వీల్స్ స్క్వేర్డ్ వీల్ ఆర్చీస్ మోడల్లో ఉన్నాయి. సీ- పిల్లర్ కు డ్యూయెల్ టోన్, బ్లాక్ రూప్ రెయిల్స్ కలిగి ఉన్నాయి. ఫ్రంట్ లో ఎల్ ఈడీ యూనిట్ తరహాలో హెడ్ లైట్స్ ఉన్నాయి
Exter SUV ఎక్స్ షో రూం ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. స్పెషిఫికేషన్, ఫీచర్స్, ధరపై ఇంకా కంపెనీ ఫుల్ డిటేయిల్స్ ఇవ్వలేదు. అయితే ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా పంచ్, మారుతి సుజుకీ ఇగ్నిస్, నిస్సాన్ మోడళ్లకు పోటీనిస్తుందని అంటున్నారు. ఐఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్ తో పాటు ఫీచర్ లోడెడ్ ఎస్ యూవీగా ఉంది. భారీ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, కనెక్టెడ్ టెక్నాలజీతో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి.
ఆన్లైన్లో Exter SUV వివరాలు అందుబాటులో ఉంచడంతో దీనిపై ఆసక్తి చూపుతున్నారు. కొత్తకారు కొనేవారు Exter SUV బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నారు. అయితే ఈ మోడల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ మోడల్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరలో SUV కావాలనుకునేవారు దీనిని బుక్ చేసుకోవచ్చని ఎక్స పర్ట్స్ చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే బుక్ చేసుకునేందుకు రెడీ అవ్వండి..
