నటసింహం బాలయ్య ( Balayya) – షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ పై లేటెస్ట్ గా ఒక అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో ప్రముఖ మాజీ లవర్ బాయ్ తరుణ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు. తరుణ్ రోల్ లో నెగిటివ్ యాంగిల్ ఉంటుందని తెలుస్తోంది. పైగా తరుణ్ లుక్ కూడా చాలా వైలెంట్ గా ఉంటుందట.
ఇగోతో రెచ్చిపోయే ఒక యువ రాజకీయ నాయకుడి పాత్రలో తరుణ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 4వ తేదీ నుండి మొదలు కానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం శ్రుతి హాసన్ లావు పెరగడానికి కసరత్తులు చేస్తోంది.
కాగా ఈ క్రమంలో శ్రుతి హాసన్ కొత్త డైట్ ఫాలో అవుతుంది. మొత్తానికి ఈ ముదురు భామ పూర్తిగా సరికొత్త లుక్ తో రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా కథలో ఫుల్ యాక్షన్ తో పాటు ఓ ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమా కథ రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని కూడా బాగా వినిపించింది.
పైగా ఈ సినిమాలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారట. అలాగే ఈ కథలో వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్, మరియు ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా హైలైట్ గా ఉండబోతున్నాయి. బాలయ్య కామెడీ టైమింగ్ కూడా సినిమాలో బాగా హైలైట్ అవుతుందట.