Love Today Movie Review: ‘లవ్ టుడే’ మూవీ ఫుల్ రివ్యూ
Love Today Movie Review: నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, ఇవానా, సత్య రాజ్, యోగి బాబు, రవీనా రవి, రాధికా శరత్ కుమార్ దర్శకుడు : ప్రదీప్ రంగనాథన్ నిర్మాత : కలపతి ఎస్ గణేష్ బ్యానర్లు : AGS ఎంటర్టైన్మెంట్స్ మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా డీఓపీ : దినేష్ పురుషోత్తం ఎడిటర్ : ప్రదీప్ ఈ రాఘవ్ చిన్న సినిమాగా విడుదలై తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ‘లవ్ […]

Love Today Movie Review: నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, ఇవానా, సత్య రాజ్, యోగి బాబు, రవీనా రవి, రాధికా శరత్ కుమార్
దర్శకుడు : ప్రదీప్ రంగనాథన్
నిర్మాత : కలపతి ఎస్ గణేష్
బ్యానర్లు : AGS ఎంటర్టైన్మెంట్స్
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
డీఓపీ : దినేష్ పురుషోత్తం
ఎడిటర్ : ప్రదీప్ ఈ రాఘవ్

Love Today Movie Review
చిన్న సినిమాగా విడుదలై తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ‘లవ్ టుడే’..కేవలం 5 కోట్ల రూపాయిల ఖర్చు తో తెరకెక్కించిన ఈ సినిమా తమిళనాడు బాక్స్ ఆఫీస్ వద్ద 75 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఒక స్టార్ హీరో సినిమా మినహా ఇది వరుకు తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక చిన్న సినిమాకి ఈ స్థాయి వసూళ్లు ఎప్పుడూ రాలేదు..జయం రవి తో ‘కోమలి’ వంటి సూపర్ హిట్ ని తీసిన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ హీరోగా కూడా చేసాడు..తెలుగు లో ఈ సినిమా ని రీమేక్ చెయ్యడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు చాలా గట్టి ప్రయత్నాలే చేసాడు..కానీ నిర్మాతలు ససేమీరా ఒప్పుకోకపొయ్యేసరికి..తెలుగు లో డబ్ చేసి ఈరోజు గ్రాండ్ గా విడుదల చేసాడు..మరి ఈ సినిమా ఎలా ఉందొ ఒకసారి ఈ రివ్యూ లో చూసేద్దాం.
కథ :
ప్రదీప్ ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేసే అబ్బాయి..అతని ప్రేయసి నిఖిత (ఇవానా) కూడా మరో సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూంటాది..వీళ్లిద్దరు ప్రేమలో ఉంటారు..అయితే ప్రదీప్ వాళ్ళ అక్క దివ్య(రవీనా రవి) కి డాక్టర్ యోగి(యోగి బాబు) తో పెళ్లి కుదురుతుంది..అక్క పెళ్లి అవ్వగానే ఇంట్లో మన ప్రేమ సంగతి చెప్పేస్తాను అని ప్రదీప్ తో చెప్తుంది నిఖిత..కానీ ఇంతలోపే వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం గురించి నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్య రాజ్) కి తెలిసిపోతుంది..తెలిసిన తర్వాత వీళ్లిద్దరి పెళ్ళికి ఒప్పేసుకుంటాడు కానీ ఒక షరతు పెడుతాడు..మీరిద్దరూ ఒక రోజు మొత్తం ఒకరి ఫోన్ ఒకరు మార్చుకొని వాడాలి అంటాడు..ఇద్దరూ ఒప్పుకొని ఒకరి ఫోన్ ఒకరు మార్చుకుంటారు..అలా ఫోన్లు మార్చుకున్న వీళ్లిద్దరి జీవితాలు ఎలా మారాయి..? వీళ్లిద్దరి ఫోన్లో ఉన్న రహస్యాలు వాళ్ళ జీవితం లో ఎలాంటి గొడవలను రేపాయి..? చివరికి వీళ్లిద్దరు ఒకటై పెళ్లి చేసుకుంటారా లేక విడిపోతారా ? అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ:
సొంత భార్య తో కూడా చెప్పుకోలేని రహస్యాలన్నీ మన ఫోన్ లో ఉంటాయి..ఫోన్ నేటి తరం యువకులకు శరీరం లో ఒక భాగంగా మారిపోయింది మొబైల్..మన జీవిత చరిత్ర మొత్తం ఫోన్ లోనే ఉంటుంది..లవర్స్ కి కూడా ఈ తమ వ్యక్తిగత మొబైల్ ని షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు..అలాంటి సెన్సిటివ్ పాయింట్ ని పట్టుకొని ఈ చిత్ర కథని తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్..ఫస్ట్ హాఫ్ లో తన లవర్ కి సంబంధించిన పాత బాయ్ ఫ్రెండ్ రహశ్యాలు..వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాటింగ్ మరియు వాయిస్ మెసేజిలను విని హీరో చాలా ఫీల్ అవుతాడు..ఈ సీన్స్ అన్ని ఫుల్ ఫన్ తో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని పంచుతుంది..ఇక సెకండ్ హాఫ్ లో హీరో కి సంబంధించిన రష్యాలన్నీ హీరోయిన్ కి తెలిసిపోతాది..వాటిని డిఫెండ్ చేసుకోలేక హీరో పడే తంటాలు మామూలువి కావు పాపం.

Love Today Movie Review
ఫస్ట్ హాఫ్ మొత్తం పొట్ట చెక్కలు అయ్యే రేంజ్ కామెడీ ఉంటుంది..ఇటీవల కాలం ఒక సినిమాని చూసి ఇంతలా నవ్వుకొని ఉండము..ఆ రేంజ్ లో ఉంటుంది..కానీ సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ కాస్త తగ్గినా..ఎమోషనల్ గా ఆడియన్స్ ని బాగా కనెక్ట్ చేస్తుంది..ఒక నిమిషం కూడా ఫోన్ వదలలేని పాత్రలో ప్రముఖ కమెడియన్ యోగిబాబు కనిపిస్తాడు..ఆయన పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది..కానీ పతాక సన్నివేశం లో సెంటిమెంట్ తో ఏడిపించేస్తాడు యోగిబాబు..అలా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా సెంటిమెంట్ పరంగా ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది..ప్రదీప్ రంగనాథన్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు..నటుడిగా కూడా తనలోని అద్భుతమైన ప్రతిభని ఈ సినిమా ద్వారా చూపిస్తాడు..అతని ఎమోషన్స్ అన్నీ కూడా మన నిజ జీవితానికి రిలేట్ చేసే విధంగా ఉంటుంది..ఇక హీరోయిన్ ఇవానా కూడా తన నటనతో యూత్ ని ఆకర్షిస్తుంది..ఇక యోగిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఈ చిత్రానికి బ్యాక్ బోన్ లాగ నిలిచాడాయన.
చివరి మాట:
కామెడీ సినిమాలను ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండీ..చాలా కాలం తర్వాత పొట్ట చెక్కలయ్యి..కడుపుబ్బా నవ్వుకునే సినిమాగా లవ్ టుడే నిలుస్తుంది..కాబట్టి ప్రేక్షకులందరూ ఈ వీకెండ్ ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి.
రేటింగ్ : 2.75/5
Recommenden Videos:
