రచ్చ గెలిచి…ఇంట గెలవలేకపోతున్న బీజేపీ

భారతీయ జనతా పార్టీ ఉత్తరాన ఉన్న అన్ని రాష్ట్రాలలో తన ప్రభావం చూపగలుగుతున్నా..ఢిల్లీ పరిస్థితి మాత్రం అందని ద్రాక్షలా మారింది. 2014 నుంచి దేశంలో ఉన్న సగానికి పైన రాష్ట్రాలలో అధికారం చేజికుంచుకున్న.. కొన్ని రాష్ట్రాలు మాత్రం బీజేపీకి పెద్ద సవాలుగానే మిగిలిపోయాయి. దక్షణాది రాష్ట్రాలలో కర్ణాటక మినిహాయించి అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే హవా. ఉత్తరాది రాష్ట్రాలలో మాత్రం జాతీయ పార్టీల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగానే బీజేపీ అన్ని రాష్ట్రాలలో తన ముద్ర […]

  • Written By: Raghava
  • Published On:
రచ్చ గెలిచి…ఇంట గెలవలేకపోతున్న బీజేపీ

భారతీయ జనతా పార్టీ ఉత్తరాన ఉన్న అన్ని రాష్ట్రాలలో తన ప్రభావం చూపగలుగుతున్నా..ఢిల్లీ పరిస్థితి మాత్రం అందని ద్రాక్షలా మారింది. 2014 నుంచి దేశంలో ఉన్న సగానికి పైన రాష్ట్రాలలో అధికారం చేజికుంచుకున్న.. కొన్ని రాష్ట్రాలు మాత్రం బీజేపీకి పెద్ద సవాలుగానే మిగిలిపోయాయి.

దక్షణాది రాష్ట్రాలలో కర్ణాటక మినిహాయించి అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే హవా. ఉత్తరాది రాష్ట్రాలలో మాత్రం జాతీయ పార్టీల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగానే బీజేపీ అన్ని రాష్ట్రాలలో తన ముద్ర వేసింది కానీ…దేశ రాజధాని అయిన ఢిల్లీలో మాత్రం సరి అయిన వ్యూహాలు రచించలేక పోతుంది.

దేశాన్ని పాలించే ఏ పార్టీ అయిన రాజధాని నుంచే తన పాలనా చేయాల్సి ఉంటుంది. అలాంటి దేశ రాజధానిలో అధికార పార్టీ విజయం సాధించలేక పోతే అది ఒక చెరగని మచ్చలా మారుతుంది. ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకి ఏడు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది..దీనితో ఢిల్లీ పీఠం బీజేపీదే అని అంచనా వేశారు..కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ..మరల ప్రజలు కేజ్రీవాల్ కే పట్టం కట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచినా…అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడటం బీజేపీకి కోలుకోలేని దెబ్బె. దీన్ని బట్టి ప్రజలు కేజ్రీవాల్ కే మొగ్గు చూపుతున్నారన్న విషయం అర్ధం అవుతుంది. పార్లమెంటు ఎన్నికలకి…అసెంబ్లీ ఎన్నికలకి పూర్తి వ్యత్యాసం ఉంటుంది.

ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడిగా కేజ్రీవాల్ కి మంచి గుర్తింపు ఉంది. అతను ప్రవేశపెట్టిన పధకాలు ప్రజలని కట్టి పడేశాయి. అమిత్ షా ఎన్ని పధకాలు పన్నిన.. ఎన్ని వ్యూహాలు రచించినా.. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించలేక పోయాడు. జరుగుతున్న పరిస్థితులని చూస్తుంటే బీజేపీ క్రమక్రమంగా అసెంబ్లీ స్థానాలలో తన పట్టు కోల్పోతూ వస్తుంది. అమిత్ షా వ్యూహాలు పనిచేయటం లేదనే వాదనకూడా ప్రజల్లో గట్టిగ వినిపిస్తుంది. ఇకనైనా బీజేపీ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమైతే…ఇతర రాష్ట్రాలలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది

సంబంధిత వార్తలు