Weight Loss Tips: మనం తినే ఆహారంతో మనకు శక్తి వస్తుంది. దాన్ని కేలరీలలో కొలుస్తారు. తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే కొవ్వుగా మారుతుంది. దాంతో మనకు ఇబ్బందులు తలెత్తుతాయి. కొవ్వు పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనకు ఆహారం ద్వారా వచ్చే శక్తి కరగాలంటే కొన్ని పనులు చేస్తే సరిపోతుంది. ఇంట్లో చేసే పనులే చేస్తూ ఉంటే కొవ్వు కరగడం సహజం. ఇంటి ఆవరణలో తోట పెట్టుకుంటే దాని పనులు చేస్తే మనకు ఎంతో శక్తి కరుగుతుది. ఆటలు ఆడితే కూడా కేలరీలు ఖర్చవుతాయి. ఇలా మనకు లభించే కేలరీలను తగ్గించుకునేందుకు ప్రయత్నించడం మంచిది. దీని వల్ల మన శరీరానికి అధిక కొవ్వు ముప్పు ఉండదు.

Weight Loss Tips
స్కేటింగ్ ద్వారా..
స్కేటింగ్ చేస్తే 683 కేలరీల శక్తి ఖర్చవుతుంది. అన్నింటికంటే ఇందులోనే ఎక్కువ మొత్తంలో కేలరీలు ఖర్చు కావడంతో స్కేటింగ్ చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది. కానీ దీనికి శిక్షణ కావాలి. ఇష్టమొచ్చినట్లుగా కట్టుకుంటే కిందపడిపోవడం ఖాయం. అందుకే ట్రైనింగ్ తీసుకున్న వారే దీనికి అర్హులు. శిక్షణ తీసుకోని వారు తీసుకున్నాకే దీనికి సిద్ధపడాలి. మనం ఎక్కడికైనా వెళ్లాలంటే నడవడం మానేసి ఆటోలు, బస్సులు ఎక్కుతుంటాం. అది కరెక్టు కాదు. బ్యాగు మోస్తూ నడిస్తే 637 కేలరీల శక్తి ఖర్చవుతుదని చెబుతున్నారు.
హైకింగ్, ట్రెక్కింగ్
హైకింగ్, ట్రెక్కింగ్ ద్వారా 546 కేలరీల శక్తి తగ్గుతుంది. పర్వతాలు, కొండలు అధిరోహించడాన్ని హైకింగ్, ట్రెక్కింగ్ అని చెబుతారు. దీంతో ఇది చేయడానికి మొగ్గు చూపితే మంచి ఫలితం ఉంటుంది. శక్తి ఖర్చు కావడానికి ఈత కొట్టడం కూడా మంచి సాధనమే. దీంతో 528 కేలరీల శక్తి ఖర్చవుతుంది. దీంతో ఈ పనులు చేస్తే ఎంతో ఉత్తమం. ఈత కొడితే శరీరంలోని అన్ని భాగాలు కదులుతాయి. అన్నింటికి వ్యాయామం చేసినట్లు అవుతుంది. అందుకే ఈత కొట్టడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు.
నడక
అందరు రోజు విధిగా చేసే పని నడక. ఇది అందరికి సాధ్యమే. ఉదయం లేచిన తరువాత కనీసం ఓ 45 నిమిషాలైనా నడిచేందుకు అందరు ఇష్టపడుతుంటారు. పైగా అందరికి అనువుగా ఉండేది నడకే. దీంతో ప్రతి ఒక్కరు ఉదయం పూట నడిచేందుకు మొగ్గు చూపుతున్నారు. నడక ద్వారా 391 కేలరీల శక్తి ఖర్చవుతుంది. గోల్ఫ్ ఆడటం కూడా మంచిదే. దీంతో కూడా 391 కేలరీల శక్తి తగ్గుతుంది. ఈ రెండింటికి కూడా సమాన స్థాయిలో కేలరీలు ఖర్చు కావడంతో వీటిలో నడకకే ఎక్కువ మంది నిర్ణయించుకుంటారు.

Weight Loss Tips
సైకిల్ తొక్కితే..
సైకిల్ తొక్కితే కూడా మనకు కేలరీలు ఖర్చవుతాయి. దీని ద్వారా 364 కేలరీల శక్తి తగ్గుతుంది. ప్రతి రోజు చిన్న చిన్న పనులకు సైకిల్ వాడటమే అలవాటు చేసుకుంటే ఉత్తమం. సెయిలింగ్ ద్వారా కూడా మంచి లాభమే. దీంతో 319 కేలరీల శక్తి ఖర్వుతుందని అంచనా. ఈ నేపథ్యంలో మనం తిన్న ఆహారం ఖర్చు కావడానికి అనేక పద్ధతుల్లో మనం శ్రమించాల్సి ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తే 273 కేలరీలు, బాల్ రూం డ్యాన్స్ తో 273 కేలరీల శక్తి కరిగిపోతుంది. ఇలా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించుకోవడానికి ఈ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది.